Apple iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఎంత ఉందో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Apple iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా తక్కువ ధరకే కొనేసుకోండి.

Apple iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఎంత ఉందో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Apple iPhone 16 Pro Max

Updated On : August 16, 2025 / 10:36 AM IST

Apple iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనాలని చూస్తున్నారా? ఈ కొత్త ఐఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫ్లిప్‌కార్ట్ (Apple iPhone 16 Pro Max) ఆపిల్ హై-ఎండ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

రూ.25 వేల వరకు సేవింగ్ చేసుకోవచ్చు. పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవుతున్నా సరే లేదంటే  ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ కొనేందుకు చూస్తున్నా ఈ అద్భుతమైన ఆఫర్ పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,24,900కు లభ్యమవుతోంది. రూ. 20వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, నాన్-ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 5వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడ్ చేయవచ్చు. ఇంకా డబ్బులను ఆదా చేసుకోవచ్చు.

Read Also : Vivo T4 Pro : కొత్త వివో T4 ప్రో ఫోన్ వస్తోంది.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం డిజైన్‌ను కలిగి ఉంది. అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ కలిగి ఉంది.

హుడ్ కింద, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఆపిల్ 3nm A18 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ హై-ఎండ్ ఫోన్ జెన్‌మోజీ, ఇమేజ్ ప్లేగ్రౌండ్, సిరితో చాట్‌జీపీటీ సపోర్టుతో సహా అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌ అందించే 12MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.