Vivo T3 Ultra Price : కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో T3 అల్ట్రా అతి తక్కువ ధరకే..!
Vivo T3 Ultra Price : వివో T3 అల్ట్రా ఫోన్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo T3 Ultra Price
Vivo T3 Ultra Price : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. వివో T3 అల్ట్రా 5G భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. కొత్త ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుటే ఇదే బెస్ట్ టైమ్. ఈ వివో T3 అల్ట్రా (Vivo T3 Ultra Price) ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ఫ్రాస్టెడ్ గ్లాస్, కీహోల్ షేప్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంది.
మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5,500mAh బ్యాటరీ, కంపెనీ సిగ్నేచర్ ‘ఆరా రింగ్ లైట్’ కూడా కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 4వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ధర రూ. 27వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వివో T3 అల్ట్రాపై ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో వివో T3 అల్ట్రా 5G ధర :
వివో T3 అల్ట్రా 5G ఫోన్ 8GB, 128GB కాన్ఫిగరేషన్ ప్రారంభ ధర రూ.31,999పై ఫ్లాట్ రూ.4వేలు డిస్కౌంట్ పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.27,999కు అమ్ముడవుతోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.4వేల వరకు 5శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
అదనంగా, కొనుగోలుదారులు నెలకు 985 చొప్పున 36 నెలల ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ డీల్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఫ్రాస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
వివో T3 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
వివో T3 అల్ట్రా 5G ఫోన్ 6.78-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9200+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్‌టచ్ OS1పై రన్ అవుతుంది. 80-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో T3 అల్ట్రా బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో కూడిన 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.