SBI Home Loan Rates : SBI కస్టమర్లకు బిగ్ షాక్.. హోం లోన్ తీసుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీ రేట్లు.. EMI ఎంత పెరగనుందంటే?

SBI Home Loan Rates : ఇల్లు కొనడం ఇక కలే.. ఎస్బీఐ కొత్త కస్టమర్లకు హోం లోన్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. సామాన్యులను షాక్‌ ఇచ్చింది.

SBI Home Loan Rates : SBI కస్టమర్లకు బిగ్ షాక్.. హోం లోన్ తీసుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీ రేట్లు.. EMI ఎంత పెరగనుందంటే?

SBI Home Loan Rates

Updated On : August 16, 2025 / 1:13 PM IST

SBI Home Loan Rates : కొత్త ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)లో హోం లోన్ తీసుకునేవారికి షాకింగ్ న్యూస్.. కొత్త ఇల్లు కొనడం (SBI Home Loan Rates) అనేది మరింత ప్రియంగా మారనుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ హోం లోన్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. ప్రత్యేకించి కొత్త కస్టమర్లకు గృహ రుణాల వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచేసింది.

హోం లోన్లు మరింత ప్రియం :
ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును తగ్గించగా, మార్కెట్లో వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్న వేళ ఎస్బీఐ సామాన్యులకు షాకిచ్చింది. ప్రైవేటు బ్యాంకులు హోం లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ పోతుంటే ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాత్రం హోం లోన్లపై వడ్డీ రేట్లను అమాంతం పెంచాయి. ఈ పెంపుతో రాబోయే రోజుల్లో హోం లోన్లు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. ముఖ్యంగా క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్న కస్టమర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత జూలై చివరిలో ఎస్బీఐ హోం లోన్ వడ్డీ రేట్లు 7.5శాతం, 8.45 శాతం మధ్య ఉన్నాయి. కానీ, ఇప్పుడు సవరించిన వడ్డీ రేట్ల తర్వాత కొత్త కస్టమర్లు 7.5శాతం నుంచి 8.70శాతం వరకు వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. హోం లోన్లపై వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. మరోవైపు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వడ్డీ రేట్లను 7.45శాతానికి పెంచింది. గతంలో 7.35శాతంగా ఉంది.

ఈఎంఐ ఎంత పెరగనుందంటే? :
ఉదాహరణకు.. కస్టమర్ 20 ఏళ్ల కాలానికి రూ. 50 లక్షల హోం లోన్ తీసుకుంటారని అనుకుందాం. గతంలో వడ్డీ రేటు 7.5శాతం ఉంటే.. ఈఎంఐ దాదాపు రూ. 40,280 ఉండేది. కానీ, ఇప్పుడు అదే హోం లోన్ 8.7శాతానికి తీసుకుంటే.. ఈఎంఐ దాదాపు రూ. 44వేలకు పెరుగుతుంది. అంటే.. కస్టమర్లు ప్రతి నెలా దాదాపు రూ. 3,700 అదనంగా చెల్లించాల్సి రావచ్చు.

Read Also : Apple iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఎంత ఉందో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఏ కస్టమర్లపై ఎక్కువగా ప్రభావమంటే? :
హోం లోన్లపై వడ్డీరేట్ల పెంపు కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని SBI క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే గృహ రుణం తీసుకున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదు. లో-క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది.

బ్యాంకింగ్ వర్గాల ప్రకారం.. తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందించడం బ్యాంకులు పెద్దగా లాభం ఉండదు. అందుకే తక్కువ క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్ల నుంచి ఎక్కువ వడ్డీని వసూలు చేయడం ద్వారా బ్యాంకులు తమ మార్జిన్‌లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు వ్యత్యాసం ఏంటి? :

SBI, యూనియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా పెంచేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇప్పటికీ తక్కువ రేట్లకే రుణాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు.. HDFC బ్యాంక్ ప్రారంభ గృహ రుణ రేట్లు 7.90శాతం, ICICI బ్యాంక్ 8శాతం, యాక్సిస్ బ్యాంక్ 8.35శాతంగా అందిస్తున్నాయి. ఈ విషయంలో ప్రైవేట్ బ్యాంకులు సైతం ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్ణయాన్ని ప్రశ్నించాయి. ఇదంతా లాభదాయకం కాదని పేర్కొన్నాయి.

వడ్డీ రేట్ల పెంపు ఎందుకంటే? :
ఆర్బీఐ డేటా ప్రకారం.. గత జూన్ 2025తో ముగిసిన సంవత్సరంలో గృహ రుణ వృద్ధి 9.6శాతంగా నమోదైంది. గత ఏడాదిలో 36.3శాతంగా నమోదైంది. ఫలితంగా డిమాండ్ క్రమంగా మందగిస్తోంది. బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ (NIM)పై ఒత్తిడి పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి ఎంపిక చేసిన లోన్లపై వడ్డీ రేట్లను పెంచడం వల్ల బ్యాంకులు లాభాలతో పుంజుకునేందుకు అవకాశం పెరుగుతుంది.

ఇతర బ్యాంకులూ వడ్డీ రేట్లు పెంచుతాయా? :
ప్రస్తుతం ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా పెరుగుతోంది. CRIF హైమార్క్ ప్రకారం.. కొత్త గృహ రుణాలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా FY22లో 34శాతం ఉండగా, FY25లో 43 శాతానికి పెరిగింది. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉంది.