Oppo K13 Turbo Pro : ఒప్పో K13 టర్బో ప్రో సేల్ మొదలైందోచ్.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే.. డోంట్ మిస్..!
Oppo K13 Turbo Pro : ఒప్పో K13 టర్బో ప్రో సేల్ మొదలైంది. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందండి.

Oppo K13 Turbo Pro
Oppo K13 Turbo Pro : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఒప్పో K13 సిరీస్‌ను విస్తరించింది. ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రో అనే మరో రెండు (Oppo K13 Turbo Pro) కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో ప్రో మోడల్ రిలీజ్ అయిన మూడు రోజులకే అమ్మకానికి వచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అడ్వాన్స్ ఎయిర్-కూలింగ్ సిస్టమ్, అల్ట్రా-లో పవర్, ఫుల్ లెవల్ వాటర్‌ఫ్రూఫింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఒప్పో K13 టర్బో ప్రో : భారత్ ధర ఎంతంటే? :
ఒప్పో K13 టర్బో ప్రో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ రూ. 37,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ రూ. 39,999 రెండు కాన్ఫిగరేషన్లలో పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 15న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వచ్చింది. మిడ్‌నైట్ మావెరిక్, పర్పుల్ ఫాంటమ్, సిల్వర్ నైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
దాంతో ధర వరుసగా రెండు వేరియంట్లపై రూ. 34,999, రూ. 36,999కి తగ్గింపు పొందవచ్చు. ఈ ఒప్పో ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ డోర్‌స్టెప్ డెలివరీ సర్వీసును కూడా అందిస్తోంది.
ఒప్పో K13 టర్బో ప్రో స్పెసిఫికేషన్లు :
ఒప్పో K13 టర్బో ప్రో 5G ఫోన్ ట్రెడేషన్ల ఫ్యాన్ల కన్నా అడ్వాన్స్ ఎయిర్-కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఎల్-ఆకారపు డక్ట్ కోసం ప్రాసెసర్‌కు కూలింగ్ ఎయిర్ అందిస్తుంది. అయితే, అల్ట్రా-సన్నని 0.1mm బ్లేడ్‌లతో కూడిన మైక్రో-సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ 18,000 RPM వద్ద రన్ అవుతుంది.
ఈ ఒప్పో 7,000mm² వేపర్ చాంబర్, 19,000mm² గ్రాఫైట్ లేయర్ కూడా కలిగి ఉంటుంది. ఈ కూలింగ్ సిస్టమ్ బీజీఎంఐ వంటి గేమ్ సమయంలో డివైజ్ టెంపరేచర్ 2 నుంచి 4°సెంటిగ్రేట్ తక్కువగా ఉంచుకోవచ్చు.
గేమింగ్-సెంట్రిక్ ఫీచర్లలో సినాప్సిస్ 3910P ఫ్లాగ్‌షిప్ టచ్ ఐసీ, గేమింగ్ హాట్ జోన్స్ కాలిబ్రేషన్, గ్లోవ్ మోడ్, స్ప్లాష్ టచ్ ఉన్నాయి. ఈ ఒప్పో (OReality) ఆడియోతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 300 శాతం వరకు అల్ట్రా వాల్యూమ్ మోడ్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఆఫన్లు ఉన్నాయి.
అలాగే వన్-ట్యాప్ రీప్లే, ఫుట్‌స్టెప్ ఎన్‌హాన్సర్, సైలెంట్ లాంచ్ వంటి ఏఐ గేమ్ అసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి. ఒప్పో K13 టర్బో ప్రో బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.