Waltair Veerayya : వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే న్యూస్ లీక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్..

మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా కాలం తరువాత వస్తున్న పక్క మాస్ మసాలా చిత్రం “వాల్తేరు వీరయ్య”. చిరు సూపర్ హిట్ మూవీ ముఠామేస్త్రి తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్స్ తో మాస్ మూల విరాట్ గా దర్శనమివ్వనున్నాడు. ఇటీవల విడుదలయిన టైటిల్ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, మూవీ మీద ఉన్న అంచనాలను కూడా పెంచేసింది. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా గురించి ఒక న్యూస్ లీక్ చేస్తూ ఒక ట్వీట్ వేశాడు. అదేంటంటే..

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే న్యూస్ లీక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్..

Devi Sri Prasad leaked the wonderful news from Waltair Veerayya

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా కాలం తరువాత వస్తున్న పక్క మాస్ మసాలా చిత్రం “వాల్తేరు వీరయ్య”. చిరు సూపర్ హిట్ మూవీ ముఠామేస్త్రి తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్స్ తో మాస్ మూల విరాట్ గా దర్శనమివ్వనున్నాడు. ఇటీవల విడుదలయిన టైటిల్ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, మూవీ మీద ఉన్న అంచనాలను కూడా పెంచేసింది.

Waltair Veerayya: మెగా మాస్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న వీరయ్య..?

ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తున్నాడు. తాజాగా దేవి ఈ సినిమా గురించి ఒక న్యూస్ లీక్ చేస్తూ ఒక ట్వీట్ వేశాడు. అదేంటంటే.. “ఈ న్యూస్ లీక్ చేయకుండా ఉండలేకపోతున్నా. ఇప్పుడే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ ని చూసా, బాస్ ఎనర్జిటిక్ డాన్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ వీక్ లో ఫస్ట్ సింగల్ రిలీజ్ కాబోతుంది, కాబట్టి బాస్ పార్టీకి సిద్దంకండి” అంటూ ట్వీట్ చేశాడు.

ఈ న్యూస్ విన్న మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ‘ఊర్వశి రౌతేలా’ రంగంలోకి దించారు చిత్ర యూనిట్. మరి అదే పాటని విడుదల చేస్తారో లేదో చూడాలి. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు.