Balapur 2021: బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా..!

తీన్ మార్ అనేసరికి భక్తులు జై బోలో గణేశ్ మహరాజ్ కీ అంటూ నినాదాలు చేశారు. ...........................................................................................................

Balapur 2021: వినాయక చవితి పండుగ రాగానే భక్తిభావం ఉప్పొంగుతుంది. విఘ్నాలు తొలగించే గణనాథుడి సేవలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు భక్తులు.  నవరాత్రులు పూజలందుకున్న గణపతిని… పదోరోజున గంగమ్మ ఒడికి తరలించడం ఆనవాయితీ. పవిత్రంగా భావించే గణపతి చేతిలోని లడ్డూను వేలం వేయడం తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. అలాంటి వాటిలో.. బాలాపూర్ లడ్డూ వేలం ఇప్పటికే చరిత్రకెక్కింది. ఏటికేడు వేలంలో లక్షల్లో రేటు పలుకుతున్న బాలాపూర్ లడ్డూను  ఈసారి ఇద్దరు సంయుక్తంగా దక్కించుకున్నారు.

Balapur : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర

ఆ ఇద్దరే… మర్రి శశాంక్ రెడ్డి (Marri Shashank Reddy), ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్(MLC Ramesh Yadav).  ఆనవాయితీగా వస్తున్న వేలంపాటలో.. ఈ ఇద్దరూ ఈసారి స్థానికులతో పోటీ పడ్డారు. వేలం పాట 2019కి మించిన రేటును సమీపించినప్పుడు.. అందరిలో ఉత్కంఠ పెరిగింది. ఐతే.. చివరకు.. 18లక్షల 90వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు శశాంక్ రెడ్డి. రమేశ్ యాదవ్. ఈ మార్క్ దగ్గర తీన్ మార్ అనేసరికి భక్తులు జై బోలో గణేశ్ మహరాజ్ కీ అంటూ నినాదాలు చేశారు.

ఇంతకీ వీళ్లిద్దరూ ఎవరంటే..!

మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.రమేశ్ యాదవ్ ఇద్దరూ బిజినెస్ పార్ట్ నర్స్. రమేశ్ యాదవ్ కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. పొద్దుటూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించారు. ఐతే.. క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా.. ఆ పదవి దక్కలేదు. ఐతే.. రమేశ్ యాదవ్ కు.. గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని అందించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ ఏడాదే(2021) జులైలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారు రమేశ్ యాదవ్. పదవిలోకి వచ్చిన 2 రోజులకే .. చంపేస్తామంటూ ఇంటర్నెట్ లో బెదిరింపు మెయిల్స్ రావడంతో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వార్తల్లో నిలిచారు.

Mlc Ramesh Yadav With CM Jagan

శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్ ఇద్దరూ.. అబాకస్(ABACUS) పేరుతో ‘ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్’ అనే సంస్థను హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్నారు. శశాంక్ రెడ్డి కెనడాలోని Vancouver Fairleigh Dickinson University నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఇప్పటికే 16 వేలమందికి పైగా విద్యార్థులు.. విదేశాల్లో చదువుకునేందుకు హెల్ప్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులను… యూఎస్, యూకే, కెనడాలకు తమ సంస్థ ద్వారా పంపించినట్టు తెలిపారు. బిజినెస్ పార్ట్ నర్స్ అయిన ఎం.రమేశ్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు… అబాకస్ ఓవర్సీస్ సంస్థకు సంస్థకు  సీఈఓ, సీఓఓలుగా వ్యవహరిస్తున్నారు.

Balapur Ganesh : రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..ఎంతో తెలుసా ?

పోటీపడి వేలంలో తాము దక్కించుకున్న లడ్డూను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేస్తామని రమేశ్ యాదవ్, శశాంక్ రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉండాలని బాలాపూర్ గణపతి ఉత్సవ నిర్వాహక మండపం దగ్గర చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు