World’s Shortest First Class Flight: రూ.6200కు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్.. వైరల్ వీడియో!

సాధారణంగా విమాన ప్రయాణమంటేనే కాస్త ఖర్చుతో కూడిన ప్రయాణమని మనకు తెలిసిందే. ఎంత తక్కువకాదన్నా ఒక గంట జర్నీకి వేలల్లో చార్జీలు ఉంటాయి. అలాంటిది ఇక ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ అంటే ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. కానీ.. విమాన చార్జీలు కూడా ఒక్కోసారి ఆఫర్లు పెట్టి ప్రయాణికులను అట్రాక్ట్ చేస్తుంటారు

World’s Shortest First Class Flight: సాధారణంగా విమాన ప్రయాణమంటేనే కాస్త ఖర్చుతో కూడిన ప్రయాణమని మనకు తెలిసిందే. ఎంత తక్కువకాదన్నా ఒక గంట జర్నీకి వేలల్లో చార్జీలు ఉంటాయి. అలాంటిది ఇక ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ అంటే ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. కానీ.. విమాన చార్జీలు కూడా ఒక్కోసారి ఆఫర్లు పెట్టి ప్రయాణికులను అట్రాక్ట్ చేస్తుంటారు. దీంతో పాటు నెలల ముందు లేదా వారాల ముందు ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నా టికెట్ ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి.

ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని కూడా కాస్త సాధారణ ప్రయాణికులకు దగ్గర చేసేలా చిన్న ఫస్ట్ క్లాస్ ఫైట్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే.. కేవలం £60కు మినీ ఫస్ట్ క్లాస్ విమానంలో ప్రయాణించిన ఓ యూట్యూబర్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అంటే కేవలం మన కరెన్సీలో రూ.6200 కు కొంచెం ఎక్కువన్నమాట. అది కూడా దుబాయ్ నుండి బహ్రెయిన్ వెళ్లే ఎమిరేట్స్ విమానంలో సుమారు గంట ప్రయాణాన్ని అంత తక్కువ ఖర్చుతో ఫస్ట్ క్లాస్ జర్నీ చేశాడు.

మోరిస్ అనే యూట్యూబర్ కేవలం £60కు మినీ ఫస్ట్ క్లాస్ విమానంలో టికెట్ ఎలా సంపాదించాడో దగ్గర నుండి విమానంలో తన ఫస్ట్ క్లాస్ జర్నీ ఎలా చేసాడో ఈ వీడియోలో వివరించాడు. విమానంలో తాను చూసిన సౌకర్యాలు.. సీటింగ్ కమ్ బెడ్, తన ప్రైవేట్ లాంజ్, ఫుడ్, మినీ బార్, ఫస్ట్ క్లాస్ ఫ్లైయింగ్ ఎక్స్ పీరియన్స్ అలా బహ్రెయిన్ లో లాండింగ్ వరకు అన్నీ స్పష్టంగా వివరించాడు. మోరిస్ తన ఛానెల్ లో ఈ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుండి 3.3 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టగా టన్నుల కొద్ది కామెంట్స్ సంపాదించింది. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో!

Read: Dr Karan Raj: ఉదయాన్నే రీఫ్రెష్ ఫీల్ తో మెలుకువ రావాలంటే ఎప్పుడు నిద్రపోవాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు