Best Time to Sleep : ఉదయాన్నే రీఫ్రెష్ ఫీల్ తో మెలుకువ రావాలంటే ఎప్పుడు నిద్రపోవాలో తెలుసా?

Dr Karan Raj: ఉరుకుల పరుగుల జీవితంలో అన్నిటికీ తొందరే. తిండి నుండి నిద్ర వరకూ అన్నీ లెక్కలేసుకొని బ్రతకాల్సిందే. లేదంటే జీవితలో వెనకబడిపోతామని ఇప్పుడు మనుషుల భావన. అయితే.. ప్రతిరోజు ఉదయాన్నే ప్రశాంతంగా.. మనశ్శాంతిగా.. ఒక రీఫ్రెష్ ఫీల్ తో నిద్రలేవాలని అందరూ కోరుకుంటారు

Best Time to Sleep : ఉదయాన్నే రీఫ్రెష్ ఫీల్ తో మెలుకువ రావాలంటే ఎప్పుడు నిద్రపోవాలో తెలుసా?

Dr Karan Raj

Dr Karan Raj: ఉరుకుల పరుగుల జీవితంలో అన్నిటికీ తొందరే. తిండి నుండి నిద్ర వరకూ అన్నీ లెక్కలేసుకొని బ్రతకాల్సిందే. లేదంటే జీవితలో వెనకబడిపోతామని ఇప్పుడు మనుషుల భావన. అయితే.. ప్రతిరోజు ఉదయాన్నే ప్రశాంతంగా.. మనశ్శాంతిగా.. ఒక రీఫ్రెష్ ఫీల్ తో నిద్రలేవాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇది చాలా మందికి కుదరడం లేదు. రాత్రి త్వరగానే పడుకున్నా కానీ ఉదయం నిద్రలేచిన సమయంలో భారంగా ఉందని చెప్తుంటారు. అలా ఉదయం సగం నిద్ర నుండి లేచిన ఫీల్ ఉంటే అది ఆ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది.

అయితే.. అసలు ఉదయం రీఫ్రెష్ ఫీల్ తో నిద్రలేవాలి అంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి.. అసలు ఎన్ని గంటలు పడుకుంటే ఉదయాన్నే హాయిగా నిద్రలేవోచ్చు. ఇలా చాలామందికి ప్రశ్నలు మెదడులో మెదులుతుంటాయి. దీనికి డాక్టర్ కరణ్ రాజ్ ఒక చిట్కా చెప్పారు. వైద్య వృత్తితో పాటు టిక్ టాక్ వీడియోలు కూడా చేసే డాక్టర్ కరణ్ రాజ్ తన ఫాలోవర్స్ కు కొన్ని టిప్స్ చెప్తుంటారు. అలానే ఉదయాన్నే రీఫ్రెష్ ఫీల్ తో నిద్రలేవాలంటే ఒక స్లీపింగ్ సైకిల్ ఫాలో కావాలని డాక్టర్ చెప్పారు.

ప్రతి రాత్రి మనిషి అనేక చక్రాల ద్వారా నిద్రపోతాడట. ప్రతి చక్రం తేలికపాటి నిద్రతో మొదలై.. తరవాత ఘాడ నిద్రలోకి ప్రవేశించి అక్కడ కలలు కంటూ నిద్రపోయి మళ్ళీ తేలికపాటి నిద్రలోకి వస్తూ ఉంటారట. ప్రతి చక్రం 90 నిమిషాల పాటు సాగుతుండగా.. ప్రతి చక్రంలో మనిషి అలాగే తేలికపాటి నిద్రతో మొదలుపెట్టి మళ్ళీ చివరికి తేలికపాటి నిద్రలోకి వస్తాడట. సరిగ్గా ఏదైనా చక్రం చివరి దశలో తేలికపాటి నిద్రతో ఉదయం నిద్ర లేచినట్లైతే రీ ఫ్రెష్ ఫీల్ ఉంటుందట. అదే చక్రం మధ్యలో ఘాడ నిద్రలో ఉన్న సమయంలో లేచినట్లైతే భారం ఉంటుంది.

అంటే.. ఈ చక్రాలను బట్టి ఉదయం మనం ఎప్పుడు నిద్రలేవాలని అనుకుంటామో నిర్ధారించుకొని చక్రాలకు సరిపడా సమయాన్ని లెక్కేసుకోని రాత్రి నిద్రకు ఉపక్రమిస్తే ఉదయం రీఫ్రెష్ ఫీల్ తో నిద్రలేవడం ఖాయం అంటున్నారు డాక్టర్ కరణ్ రాజ్. ఉదాహరణకు మీరు ఉదయం 7 గంటలకు నిద్రలేవాలి అనుకుంటే రాత్రి 11.30 పడుకుంటే సరిపోతుంది. ఒక్కో చక్రం 90 నిమిషాల చొప్పున మొత్తం 5 చక్రాలలో మీకు నిద్రపడుతుంది. ఐదు చక్రాలలో ఏడున్నర గంటల నిద్రతో పాటు తేలికపాటి నిద్రలో నుండి లేవడం వలన ఉదయం మీకు రీఫ్రెష్ ఫీల్ ఉంటుందట.

మరి ఇంకెందుకు ఒకసారి ట్రై చేసి చూడండి.. దాని ఫలితం కూడా తెలిసిపోతుంది. అన్నట్లు డాక్టర్ కరణ్ రాజ్ టిక్ టాక్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికి 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించగా ఎక్కువ మంది అవును నిజమే మేము ఉదయం రీఫ్రెష్ ఫీల్ తో నిద్రలేచామని డాక్టర్ కరణ్ రాజ్ కు థాంక్స్ కూడా చెప్పేసుకుంటున్నారు.