Asia Cup 2025: ఆసియా కప్.. భారత్ శుభారంభం.. యూఏఈ పై ఘన విజయం
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో భారత్ రాణించింది. యూఏఈని చిత్తుగా ఓడించింది. ఇరు జట్ల స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి..

Courtesy : @BCCI
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత్ బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 13.1 ఓవర్లలోనే 57 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలోనే చేజ్ చేసింది. 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేశారు. మరో 93 బంతులు మిగిలి ఉండగానే.. టార్గెట్ ని ఫినిష్ చేసేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. 4 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. మరో ఎండ్ లో శివమ్ దూబె వణికించాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
భారత్ తన నెక్ట్స్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ 14వ తేదీన జరగనుంది.
స్కోర్లు..
యూఏఈ – 13.1 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్
భారత్ – 4.3 ఓవర్లలో 60 పరుగులు