BRS: గులాబీ పార్టీని వదలని వరుస కష్టాలు.. బీఆర్ఎస్ పెద్దల్లో మళ్లీ కలవరం..! కారణం అదేనా?

వరుస కేసులు, విచారణలు..పార్టీలో ఇంటర్నల్‌ ఇష్యూస్‌ ఇబ్బంది పెడుతున్న టైమ్‌లో.. ఆ ఎపిసోడ్‌ బీఆర్ఎస్‌లో ఆందోళనకు దారి తీస్తోందట.

BRS: గులాబీ పార్టీని వదలని వరుస కష్టాలు.. బీఆర్ఎస్ పెద్దల్లో మళ్లీ కలవరం..! కారణం అదేనా?

Updated On : September 10, 2025 / 11:15 PM IST

BRS: అధికారం కోల్పోయి 20 నెలలు. అప్పటి నుంచి అన్నీ సమస్యలే. మొదట గులాబీ బాస్‌ కాలి తుంటికి ఖాయం. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ. నెక్స్ట్ 10 మంది ఎమ్మెల్యేల జంపింగ్. లోక్‌సభ ఎన్నికల్లో జీరో సీట్లు. కేటీఆర్‌పై ఈ కారు రేస్‌ కేసు. తర్వాత కవిత ఎపిసోడ్. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేల జంపింగ్ గుబులు కారును ట్రుబల్స్‌ నెడుతోందట.

కారు దిగనున్న మరికొందరు?

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పలువురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారన్న టాక్‌తో బీఆర్ఎస్ పెద్దల్లో మళ్లీ ఆందోళన మొదలైందట. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. వాళ్ల మీద అనర్హత కోసం ఏడాది నుంచి పోరాడుతున్నారు. పైగా సికింద్రాబాద్ కంటోన్‌మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వచ్చిన బైపోల్‌లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్‌ కారు పార్టీకి అతిపెద్ద సవాల్‌గా మారింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో మరికొందరు ఎమ్మెల్యేలు కారు దిగేందుకు రెడీ అవుతున్నారన్న టాక్‌ గులాబీ దళంలో కలవరం సృష్టిస్తోందట.

కవిత ఇష్యూ అలా సద్దుమణిగినట్లే అనుకునేలోపే..ఈ కారు రేస్‌పై ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రాసిక్యూట్ చేసేందుకు సర్కార్ గవర్నర్ అనుమతి కూడా కోరింది. ఇక కాళేశ్వరంపై సీబీఐ విచారణ అటు కేసీఆర్‌, ఇటు హరీశ్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయినా ఎక్కడా తగ్గకుండా అధికార కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది గులాబీ పార్టీ. అటు కేటీఆర్, ఇటు హరీశ్‌రావు నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ సర్కార్ విధానాలపై ప్రశ్నిస్తూ..ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతూ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారు.

త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పైగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. ఈ ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంటే..మరికొంత మంది ఎమ్మెల్యేలు జంపయ్యే అవకాశం ఉందన్న సమాచారం గులాబీ లీడర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట.

బీఆర్ఎస్ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ అడుగులు?

ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్..ఇప్పుడు మరికొంత మందితో సంప్రదింపులు జరుపుతోందట. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో ఇప్పటికే చర్చలు జరిగాయని..బీఆర్ఎస్ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ పెద్దలు అడుగులు వేస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటున్నారట. అయినప్పటికీ ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కారు దిగుతారోనన్న కంగారు కారు పార్టీలో కనిపిస్తోంది. ఇలా వరుస కేసులు, విచారణలు..పార్టీలో ఇంటర్నల్‌ ఇష్యూస్‌ ఇబ్బంది పెడుతున్న టైమ్‌లో..ఎమ్మెల్యేల వలసల ఎపిసోడ్‌ బీఆర్ఎస్‌లో ఆందోళనకు దారి తీస్తోందట. కారు పార్టీ పెద్దలు వలసలకు బ్రేకులు వేస్తారా? ఈ కష్టకాలంలో మరికొంత మంది ఎమ్మెల్యేలు జంప్ అయితే బీఆర్ఎస్‌ ఫ్యూచర్‌ ఏంటనేది చూడాలి.

Also Read: సీఎం రేవంత్, ఆ మంత్రి మధ్య గ్యాప్ ఉందా? ఆయనకు ఇన్విటేష‌న్ ఎందుకు లేదు? కాంగ్రెస్‌‌లో అసలేం జరుగుతోంది..