Kids Health: డైపర్ వల్ల పిల్లలకు ర్యాషెస్ వస్తుందా? ఈ చిన్ని చిట్కాతో ప్రాబ్లమ్ సాల్వ్
చిన్న పిల్లల కోసం డైపర్లు వాడటం అనేది సాధారణమే. ఈ సమయంలో వారి చర్మం(Kids Health) సున్నితంగా ఉంటుంది.

Kids Health: 5 tips to reduce diaper rashes in children sn
Kids Health: చిన్న పిల్లల కోసం డైపర్లు వాడటం అనేది సాధారణమే. ఈ సమయంలో వారి చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి, అలాంటి చర్మంపై డైపర్ల తడి వల్ల ర్యాషెస్ రావడం కూడా సాధారమే. ఈ ర్యాషెస్ రావడం వల్ల శరీరం ఎర్రగా మారి, చిన్న చిన్న మచ్చలు, చికాకు కలిగించే గాయాలు లాంటి లక్షణాలు కనిపిస్థాయి. అప్పుడు ఏర్పడే మంట వల్ల పిల్లలు చికాకు పడటం, ఏడవడం జరుగుతుంది. ఈ సమస్యను తగ్గించడం పెద్దవాళ్లకు(Kids Health) కూడా కాస్త ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి, ఈ సమస్యను తగ్గించడం కోసం కొన్ని చిట్కాలు అవసరం. మరి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: అన్నం తినేటప్పుడా.. తిన్నాకనా: నీళ్లు ఎప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిది
1.తరచూ డైపర్ మార్చడం:
పిల్లల మలవిసర్జన చేసిన వెంటనే డైపర్ తడిగా మారుతుంది. కాబట్టి వెంటనే మార్చేయాలి. పొడిగా ఉంచడం అనేది చాలా అవసరం. అందుకే, ప్రతి 2 నుంచి 3 గంటలకోసారి డైపర్ మార్చుకోవడం మంచిది.
2.మైల్డ్ క్లీనింగ్:
ప్రతిసారి డైపర్ మార్చే సమయంలో వెచ్చని నీటితో తుడవడం మంచిది. కానీ, అందుకొసం వాడే సున్నితమైన కాటన్, బెబీ వైప్స్‌తో శుభ్రం చేయడం మంచిది. ఆల్కహాల్, పరిమళం వైప్స్ వాడటం తగ్గించడం మంచిది.
3.పొడి చేసిన తరువాతే కొత్త డైపర్ మార్చాలి:
చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత, పూర్తిగా పొడిగా మారిన తరువాత మాత్రమే డైపర్ మార్చాలి. డైపర్ మార్చే ముందు కొన్ని నిమిషాలు ఆ ప్రాంతాన్ని గాలి తాగాలనివ్వాలి.
4.ర్యాష్ క్రీమ్ వాడటం మంచిది:
పిల్లల వైద్యనిపుణులు సూచించిన మేరకు జింక్ ఆక్సైడ్ క్రీమ్, బెబీ ర్యాష్ క్రీమ్ వాడటం వల్ల వాడటం మంచిది. ప్రతిసారి డైపర్ మార్చిన తర్వాత ఈ క్రీమ్‌ను రాయడం మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇది పిల్లల చర్మానికి రక్షణ కవచంలా ఉంటుంది.
5.కొంతసేపు డైపర్ లేకుండా ఉంచడం:
ప్రతీసారి పిల్లలను డైపర్ తో ఉంచకుండా.. కొన్ని సార్లు డైపర్ లేకుండా గాలికి ఉంచాలి. చర్మానికి గాలి తాగడం వల్ల ర్యాషెస్ మానిపోవడం జరుగుతుంది. కొత్త ర్యాషెస్ రాకుండా ఉంటుంది.
అదనపు సూచనలు:
* కొత్త డైపర్ వాడుతున్నప్పుడు చర్మం ఎలా స్పందిస్తుందో గమనించాలి
* పాల తరువాత కొత్త ఆహరం తినిపిస్తున్నప్పుడు కూడా ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది
* ర్యాషెస్ మలిన వాసన వచ్చినప్పుడు, గాయాల్లా మారినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.