Comedian Siva Reddy: ఆ హీరోతో వర్క్ చేయలేకపోయాను, మిస్సయ్యాను అనే ఫీలింగ్ ఉందా?

నా విషయంలో ఒకసారి జరిగింది. ఏదో జరిగి ఉంటేనే నాకు అంత గ్యాప్ వచ్చింది.

Comedian Siva Reddy: ఆ హీరోతో వర్క్ చేయలేకపోయాను, మిస్సయ్యాను అనే ఫీలింగ్ ఉందా?

Updated On : December 21, 2025 / 7:30 PM IST

Comedian Siva Reddy: ప్రముఖ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి 10టీవీ ఇంటర్వ్యూలో (స్టార్ షో) పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. సినిమాల్లోకి ఎలా వచ్చారు, అవకాశాలు ఎలా దక్కాయి, ప్రస్తుతం సినిమాలకు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అన్న ప్రశ్నలకు శివారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆ హీరో పక్కన చేయలేకపోయాను, మిస్సయ్యాను అనే ఫీలింగ్ ఉందా అన్న ప్రశ్నకు ఆయన ఏం చెప్పారంటే..

ప్రశ్న: మీరు చాలా మంది హీరోలతో పని చేశారు. వాళ్లు వీళ్లు అని కాదు.. చాలా మందితో చేశారు. మరి ఎవరితోనైనా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉందా?

”బాలకృష్ణతో మిస్ అయ్యాను. అసలు సిసలైన బాలయ్యతోనే మిస్ అయ్యాను. ఆయన పక్కన చేసే అవకాశం రాలేదు. మిగతా అందరు హీరోలతో చేశా. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, వెంకటేశ్, రాజశేఖర్.. ఇలా అందరితో చేశా. రాజశేఖర్ తో ఎక్కువ సినిమాలు చేశాను” అని శివారెడ్డి తెలిపారు.

ప్రశ్న: హాస్య నటుల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు రావడం కష్టం. కొంత మందికి వస్తాయి, కొంతమందికి తక్కువగా అవకాశాలు రావొచ్చు. నిజంగానే కమెడియన్ల మధ్య అలాంటి పోటీ ఉంటుందా?

”ఇండస్ట్రీలో కుళ్లు, కుతంత్రాలు ఉండవు. వందల మందిలో ఒకరిలో ఇద్దరిలో ఉండొచ్చు. నా విషయంలో ఒకసారి జరిగింది. ఏదో జరిగి ఉంటేనే నాకు అంత గ్యాప్ వచ్చింది. నా విషయంలో ఏదో జరిగింది. జరగలేదు అనేందుకు తావు లేదు. అందరూ అలాంటి వారే అని అనను. ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అంతా అలా కాదు. ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్స్ అందరూ అట్లా కాదు. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. దానివల్ల ఎవరో ఒకరు నాలాంటి వాళ్లు బలవుతారు” అని శివారెడ్డి అన్నారు.

ప్రశ్న: సినీ పరిశ్రమలో మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన కమెడియన్ ఎవరు?

” కమెడియన్ అలీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఆయనతోనే ఎక్కువ ఉండే వాడిని. ఆయన ఎక్కడికి వెళ్లినా నన్ను తీసుకెళ్లే వారు. నేను ఎక్కడికి వెళ్లినా నాతో వచ్చే వారు. అంత క్లోజ్ గా ఉండే వాళ్లం” అని శివారెడ్డి తెలిపారు.

ప్రశ్న: నేను మిమిక్రీ చేయగలను, నాలో ఈ టాలెంట్ ఉంది అని ఎప్పుడు గ్రహించారు?
”నేను మిమిక్రీ చేయగలను అని కాలేజీ లైఫ్ లోనే గ్రహించా. టెన్త్ లో, ఇంటర్ లో.. వేదిక మీదకు నన్ను పిలిచే వాళ్లు. సరదాగా మిమిక్రీ చేసే వాడిని. ఎక్కువగా గుడికి వెళ్లే వాడిని. పూజారి మంత్రాలు విని విని నాకూ వచ్చేశాయి. అచ్చం ఆయనలానే ఇంట్లో చదివా. అందరూ ఆశ్చర్యపోయారు. నన్ను బాగా మెచ్చుకున్నారు. అలా అలా వాయిస్ ఇమిటేషన్ కూడా వచ్చేసింది. ఫస్ట్ సుధాకర్ వాయిస్ ఇమిటేట్ చేశాను. తర్వాత సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వాయిస్ లు ఇమిటేట్ చేశాను” అని శివారెడ్డి చెప్పారు.

Also Read: సినిమాలకు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? కారణం ఏంటి? కమెడియన్ శివారెడ్డి రియాక్షన్ ఇదే..