Comedian Siva Reddy: సినిమాలకు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? కారణం ఏంటి?

నేను జోకులు వేస్తే సానా యాదిరెడ్డి బాగా నవ్వారు. ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని నన్ను అడిగారు.

Comedian Siva Reddy: సినిమాలకు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? కారణం ఏంటి?

Updated On : December 21, 2025 / 6:58 PM IST

Comedian Siva Reddy: ప్రముఖ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి 10టీవీ ఇంటర్వ్యూలో (స్టార్ షో) పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. సినిమాల్లోకి ఎలా వచ్చారు, అవకాశాలు ఎలా దక్కాయి, ప్రస్తుతం సినిమాలకు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అన్న ప్రశ్నలకు శివారెడ్డి సమాధానం ఇచ్చారు.

”సినిమాలకు గ్యాప్ నేనేమీ తీసుకోలేదు. అది వచ్చిందంతే. దాని గురించి మనం చర్చించి వేస్ట్. ఏదో ట్రాక్ ఎక్కా.. దేవుడి దయ వల్ల ఆ ట్రాక్ అలాగే కంటిన్యూ అవ్వాలని, నా ఊపిరి ఉన్నంత కాలం ఏదో ఒక పాత్ర.. చిన్నదైనా సరే పెద్దదైనా సరే.. ఏదో ఒకటి.. వచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాను.

96లో అవకాశం ఎలా వచ్చింది?

‘వరంగల్ లో స్టేజ్ షోలు చేస్తున్నా. నెల్లుట్ల ప్రవీణ్ చందర్.. పిట్లల దొర డ్యాన్స్ బాగా చేస్తారు. సానా యాదిరెడ్డి పిట్టల దొర మూవీ తీస్తున్నారు. సానా యాదిరెడ్డి నుంచి కాల్ వచ్చింది. పిట్టల దొర డ్యాన్స్ చేసే వాళ్లు ఎవరెవరు ఉన్నారు అని అడిగారు. ప్రవీణ్ చందర్ వెళ్తూ వెళ్తూ నన్ను కారులో తీసుకెళ్లారు. హైదరాబాద్ చూసినట్లు ఉంటుందని బయలుదేరాను. యాదిరెడ్డి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. ఇతడు ఎవరు అని అడిగితే.. మా పిల్లోడే అని పరిచయం చేశారు.

నేను జోకులు వేస్తే సానా యాదిరెడ్డి బాగా నవ్వారు. ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని నన్ను అడిగారు. యాక్టర్ అవుదామని అనుకుంటున్నా అని చెప్పా. యాక్టింగ్ పిచ్చి కూడా ఉందా అన్నారు. మా సినిమాలో చేస్తావా అని అడిగారు. అంతకంటే ఏం కావాలి.. బాక్సింగ్ రెఫరీగా చేశా. అలా క్యారెక్టర్ చేయడం జరిగింది. అది చూసుకుని చాలా మురిసిపోయాను. వేరే దర్శకులు కానీ నిర్మాతలు కానీ నాకు పరిచయం లేరు. మళ్లీ అదే సానా యాదిరెడ్డి సర్కస్ సత్తిపండు సినిమా తీశారు. అందులోనూ నాకు అవకాశం ఇచ్చారు. అది నెగిటివ్ రోల్. అదే సానా యదిరెడ్డి.. ఆ తర్వాత ప్రేమ పల్లకి, బ్యాచిలర్స్ తీశారు. అందులోనూ అవకాశాలు ఇచ్చారు.

బ్యాచిలర్స్ సినిమాలో మారుతీ వ్యాన్ డ్రైవర్ గా చేశారు. నా మ్యానరిజం, యాక్టింగ్ చూసి .. ఉప్పలనేని శివ పిలిపించారు. భయపడుతూ భయపడుతూ వెళ్లా. హీరో క్యారెక్టర్ అని చెప్పారు. చాలా ఆశ్చర్యపోయాను. నువ్వు ఒక్కడివే కాదు.. ముగ్గురు హీరోలు ఉన్నారని చెప్పారు. మీనా హీరోయిన్. ఆమె పక్కన హీరోగా చేయడం చాలా గర్వంగా అనిపించింది. అక్కడి నుంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఆనందం, మనసంతా నువ్వే, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతరం, నేనున్నాను, స్టాలిన్, దూకుడు, మనసంతా నువ్వే, అతడే ఒక సైన్యం.. ఇలా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దూకుడులో క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. దూకుడుతో కమ్ బ్యాక్ అవ్వావు, నీకిక మంచి అవకాశాలు వస్తాయని అంతా అన్నారు. కానీ, రాలేదు. చాలా డిస్సాపాయింట్ అయ్యాను. పలు కారణాలతో మౌనంగా ఉండిపోయా” అని శివారెడ్డి అన్నారు.

Also Read: కప్పు గెలవలేదు అంతే.. విన్నర్ కి ఈక్వల్ గా ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?