5 Best Camera Phones : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాను షేక్ చేసే 5 పవర్‌ఫుల్ కెమెరా ఫోన్లు.. DSLR రేంజ్ ఫొటోలు తీయొచ్చు..!
5 Best Camera Phones : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా అద్భుతమైన కెమెరా ఫీచర్లతో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది కొంటారో మీరే కొనేసుకోండి. పూర్తి వివరాలివే..

5 Best Camera Phones : మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? 2025లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా అద్భుతమైన ఫీచర్లతో అనేక స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 200MP పెరిస్కోప్ కెమెరాలు, 8K వీడియో రికార్డింగ్ నుంచి డాల్బీ విజన్ HDR, జీస్ ఆప్టిక్స్, హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ వరకు, ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు DSLR లాంటి ఇమేజింగ్, పవర్ ఫుల్ జూమ్ ప్రో-గ్రేడ్ వీడియోను అందిస్తాయి. 2025లో అద్భుతమైన కెమెరా-సెంట్రలైజడ్ ఫోన్లుగా నిలిచాయి. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాలు అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీనిచ్చేలా నిలిచాయి.

ప్రత్యేకించి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కన్నా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తాయి. భారీ పెరిస్కోప్ సెన్సార్ల నుంచి అడ్వాన్స్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్ వీడియో టూల్స్ వరకు ఈ ఫోన్లు ఇమేజింగ్ పవర్ అందిస్తాయి. కెమెరా పర్ఫార్మెన్స్ మీ టాప్ ప్రయారిటీ అయితే.. ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లలో ఏదైనా ఒకటి కొనుగోలు చేయొచ్చు. 2025 ఏడాదిలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకు పోటీనిచ్చే అద్భుతమైన కెమెరా ఫోన్‌లుగా నిలిచాయి. ఇందులో మీకు ఏ ఫోన్ కావాలో ఇప్పుడే కొనేసుకోండి.

వివో X300 ప్రో (రూ. 1,09,999) : వివో X300 ప్రో అనేది ఫొటోగ్రఫీ ఔత్సాహికుల కోసం అదిరిపోయే పవర్‌హౌస్. ఇందులో 50MP OIS-ఎనేబుల్డ్ మెయిన్ సెన్సార్, 3.7x ఆప్టికల్ జూమ్ మాక్రో సపోర్ట్‌తో భారీ 200MP పెరిస్కోప్ కెమెరా , 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. Zeiss ఆప్టిక్స్, 8K వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ HDR, 50MP సెల్ఫీ కెమెరాతో 2025 నాటి అత్యంత అడ్వాన్స్ కెమెరా ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.

ఐఫోన్ 17 ప్రో (రూ. 1,24,900) : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో క్లీన్, ప్రొఫెషనల్-గ్రేడ్ ఇమేజింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ట్రిపుల్ 48MP సెటప్ వైడ్, అల్ట్రావైడ్ 4x పెరిస్కోప్ టెలిఫోటో ఫొటోగ్రఫీని కవర్ చేస్తుంది. కచ్చితమైన డెప్త్ మ్యాపింగ్ కోసం LiDAR స్కానర్ సపోర్టు ఇస్తుంది. ProRes RAW, 120fps వరకు డాల్బీ విజన్ HDR స్పేషియల్ వీడియో రికార్డింగ్‌తో స్టేబుల్ వీడియో క్వాలిటీతో క్రియేటర్లకు అత్యంత ఆకర్షణీయమైన ఫోన్ అని చెప్పొచ్చు.

ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999) : ఒప్పో ఫైండ్ X9 ప్రో కెమెరా మల్టీఫేస్ కలర్ కచ్చితత్వంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. 50MPప్రైమరీ సెన్సార్ OISతో, 3x ఆప్టికల్ జూమ్ అందించే భారీ 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 50MP అల్ట్రావైడ్ కెమెరాను అందిస్తుంది. హాసెల్‌బ్లాడ్ కలర్ ట్యూనింగ్, లేజర్ ఎఎఫ్, ఎల్ఓజీ వీడియో, డాల్బీ విజన్ సపోర్ట్ 50MP 4K సెల్ఫీ కెమెరాతో రియల్ ఫొటోగ్రఫీ ఫస్ట్ ఫ్లాగ్‌షిప్‌గా చెప్పవచ్చు.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) : గూగుల్ పిక్సెల్ 10 ప్రో కెమెరా సిస్టమ్‌లో 50MP మెయిన్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 42MP 4K సెల్ఫీ కెమెరా గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ సపోర్టుతో డైనమిక్ రేంజ్, కచ్చితమైన కలర్ ఆప్షన్లు, హార్డ్‌వేర్ వంటి ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ s25 అల్ట్రా ఫోన్ కు మించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

వన్‌ప్లస్ 15 (రూ. 72,999) : వన్‌ప్లస్ 15 ట్రిపుల్ 50MP సెటప్, సోనీ IMX906 సెన్సార్, అల్ట్రావైడ్ లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. 8K వీడియో, డాల్బీ విజన్, HDR, అడ్వాన్స్‌డ్ స్టెబిలైజేషన్ 32MP సెల్ఫీ కెమెరాతో గెలాక్సీ S25 అల్ట్రా కన్నా బెటర్ ఫీచర్లు కలిగి ఉంది.
