Best Phones 2025 : ఇన్‌స్టా క్రియేటర్లకు పండగే.. రూ. 30Kలో బెస్ట్ ఫోన్లు.. ఫొటోలు, వీడియోలు ప్రో లెవెల్.. లైకులు, షేర్లు రాకెట్లా వస్తాయి..!
Best Phones 2025 : ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం మార్కెట్లో 5 అద్భుతమైన కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 30వేల లోపు ధరలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..

Best Phones 2025 : ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. మీరు ఇన్ స్టాలో రీల్స్ చేస్తుంటారా? అయితే ఇది మీకోసమే.. మీ కంటెంట్ అట్రాక్టివ్ గా ఉండాలంటే కెమెరా ఫీచర్లు అద్భుతంగా ఉండాలి. అయితే ఖరీదైన ఫోన్ల కన్నా తక్కువ ధరలోనే హై క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. వీడియోలతో పాటు ఫొటోలను మరింత క్వాలిటీతో వస్తాయి.

మీరు వ్లాగ్ చేస్తున్నా లేదా హై క్వాలిటీ ఫొటోలు తీసుకుంటున్నా లేదా మీ సెల్ఫీలు ప్రొఫెషనల్‌గా కనిపించాలన్నా ఈ అద్భుతమైన ఫోన్లు మీ దగ్గర ఉండాల్సిందే. క్వాలిటీ కంటెంట్‌ను కోరుకునే క్రియేటర్లు తప్పక కొనాల్సిన ఫోన్లు. రూ. 30వేల కన్నా తక్కువ ధరలో 5 అద్భుతమైన ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం.. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ కోసం ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (రూ. 29,485) : మీ ఇన్‌స్టాగ్రామ్-రెడీ ఫోటోల కోసం మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ తీసుకోండి. 50MP + 10MP + 50MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాతో పాటు 50MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన కంటెంట్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో రోజంతా కంటెంట్ క్రియేషన్ కోసం 90W వైర్డ్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రియల్‌మి GT 6 (రూ. 27,999) : రియల్‌మి GT 6 లో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు పవర్ ఫుల్ ఎడిటింగ్ కోసం డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ 5500mAh బ్యాటరీతో వస్తుంది. 120W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరాతో పాటు ఆకర్షణీయమైన రీల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

నథింగ్ ఫోన్ 3a (రూ. 24,999) : నథింగ్ ఫోన్ 3a ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాతో పాటు 50MP + 50MP + 8MP ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. మీ ఇన్ స్టా కంటెంట్ ఫీడ్ క్లియర్ షాట్‌లను తీయొచ్చు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 50W వైర్డ్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

వివో V60e (రూ. 29,999) : వివో V60e భారీ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 90W వైర్డ్ ఛార్జింగ్ సపోర్టు షూటింగ్ సెషన్‌లకు అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌తో వస్తుంది. 200MP + 8MP డ్యూయల్-కెమెరా సెటప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ వాల్యూ షాట్‌ల కోసం 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

షావోమీ 14 civi (రూ. 26,999) : షావోమీ 14 సివి ఫోన్ స్పెషల్ 32MP + 32MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా, ప్రొఫెషనల్-లుకింగ్ కంటెంట్ కోసం 50MP + 50MP + 12MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ తో పిక్చర్-పర్ఫెక్ట్ సెల్ఫీలు వ్లాగ్‌లను క్రియేట్ చేయొచ్చు. 6.55-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే , 120Hz రిఫ్రెష్ రేట్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. స్టేబుల్ పర్ఫార్మెన్స్ కోసం 67W వైర్డ్ ఛార్జింగ్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.
