Health Tips: అన్నం తినేటప్పుడా.. తిన్నాకనా: నీళ్లు ఎప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిది
మన శరీరంలో 60 నుంచి 70 శాతం వరకు నీటితో నిండి ఉంటుంది. (Health Tips)కారణం ఏంటంటే? శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియకు నీరు చాలా అవసరం.

Health Tips: What time of day is it good for health to drink water?
Health Tips: మన శరీరంలో 60 నుంచి 70 శాతం వరకు నీటితో నిండి ఉంటుంది. కారణం ఏంటంటే? శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియకు నీరు చాలా అవసరం. అందుకే, నీరు త్రాగడం మన ఆరోగ్యానికి అత్యంత అవసరం. రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. అయితే, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే అన్నం తింటున్నపుడు నీళ్లు ఎప్పుడు తాగాలి.. తినేటప్పుడు తాగొచ్చా?” లేదా “తిన్నాక తాగాలా?” (Health Tips)అనేది. మరి ఈ విషయం గురించి ఇక్కడ వివరణగా తెలుసుకుందాం.
Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ చేసే మ్యాజిక్ ఏంటో తెలుసా? ఒకేసారి ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు
1.శాస్త్రీయంగా చెప్పాలంటే:
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే ఏమవుతుంది.. చిన్న మొత్తంలో నీళ్లు తాగడం వల్ల అన్నం మింగడానికి సహాయపడుతుంది. అలాగే తినే ఆహారం మెత్తబడి జీర్ణశక్తికి సహకరిస్తుంది. కానీ, ఎక్కువ నీళ్లు తాగితే జీర్ణ రసాలు నీటితో కలిసిపోయి పల్చబడిపోయి దాని ప్రభావం తగ్గిపోతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరు తగ్గించి, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
2.అన్నం తిన్నాక వెంటనే నీళ్లు తాగితే ఏం అవుతుంది:
అన్నం తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగితే, జీర్ణక్రియ మందగిస్తుంది. ఇన్‌సులిన్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. ఆలాగే ఇది బరువు పెరుగుదలకు కారణమవుతుంది. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి గ్యాస్, ఎసిడిటీకు దారి తీస్తుంది.
3.తినే ముందు నీళ్లు తాగడం మంచిదా:
అన్నం, భోజనం తినే ముందు కనీసం 15 నుంచి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీరు తాగడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరాన్ని హైడ్రేహైడ్రేట్ చేసి అంతర్భాగాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఆయుర్వేద ప్రకారం:
* తినే సమయంలో తక్కువ నీరు తాగాలి
* తినే ముందు 30 నిమిషాల ముందు నీరు తాగడం ఉత్తమం
* తినిన తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్ తర్వాత నీటిని తాగాలి.