Car Buyer Guide : కొత్త కారు కావాలా? రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టి హ్యుందాయ్ క్రెటా ఇంటికి తెచ్చుకోండి.. నెలకు EMI ఎంతంటే?
Car Buyer Guide : హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డీజిల్ ఇంజిన్‌తో కూడా అందిస్తోంది. ఈ SUV బేస్ డీజిల్ వేరియంట్ డౌన్ ఎంత? నెలకు ఈఎంఐ ఎంత చెల్లించాలంటే?

Car Buyer Guide : కొత్త కారు కొంటున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్ భయ్యా.. మీరు హ్యుందాయ్ లవర్స్ అయితే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఆటోమేకర్ హ్యుందాయ్ భారత మార్కెట్లో మల్టీ సెగ్మెంట్లలో అనేక కార్లను విక్రయిస్తోంది. క్రెటా మిడ్-సైజ్ SUV విభాగంలో అందిస్తోంది. మీరు ఈ SUV డీజిల్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేయండి. ఆ తర్వాత మీరు ప్రతి నెలా ఎంత ఈఎంఐ కట్టాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హ్యుందాయ్ క్రెటా ధర : హ్యుందాయ్ క్రెటా ఇ-వేరియంట్‌ను డీజిల్ వేరియంట్‌గా విక్రయిస్తుంది. ఈ SUV బేస్ వేరియంట్ రూ. 12.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందిస్తోంది. ఢిల్లీలో కొనుగోలు చేస్తే.. రూ. 12.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధర రిజిస్ట్రేషన్ , ఇన్సూరెన్స్ ఛార్జీలకు అదనంగా ఉంటుంది.

ఈ కారును కొనుగోలు చేసేందుకు మీరు సుమారు రూ. 1.57 లక్షల రిజిస్ట్రేషన్ టాక్స్, సుమారు రూ. 57వేలు ఇన్సూరెన్స్ ఛార్జీలు చెల్లించాలి. అదనంగా, మీరు టీసీఎస్, ఫాస్టాగ్ ఛార్జీలుగా సుమారు రూ. 12వేలు చెల్లించాలి. ఢిల్లీలో కారు ఆన్-రోడ్ ధర రూ. 14.52 లక్షల వరకు ఉంటుంది.

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్.. ఈఎంఐ ఎంతంటే? : మీరు హ్యుందాయ్ క్రెటా డీజిల్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. బ్యాంక్ ఎక్స్-షోరూమ్ ధరకు మాత్రమే ఫైనాన్స్ చేస్తుంది. అందుకే రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత బ్యాంకు నుంచి సుమారు రూ. 12.52 లక్షలు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది. మీకు 7 ఏళ్ల పాటు బ్యాంక్ 9శాతం వడ్డీకి రూ. 12.52 లక్షలు అప్పుగా ఇస్తే.. మీరు 7 ఏళ్లకు నెలకు రూ. 20,350 ఈఎంఐ మాత్రమే చెల్లించాలి.

కారు ధర ఎంతంటే? : మీరు బ్యాంకు నుంచి 9శాతం వడ్డీ రేటుతో 7 ఏళ్ల పాటు రూ. 12.52 లక్షలకు కారు రుణం తీసుకుంటే.. మీరు 7 ఏళ్ల పాటు నెలకు రూ. 20,350 ఈఎంఐ చెల్లించాలి. 7 ఏళ్లలో హ్యుందాయ్ క్రెటా డీజిల్ వేరియంట్ కోసం సుమారు రూ. 4.57 లక్షల వడ్డీని చెల్లిస్తారు. ఆ తర్వాత మీ కారు మొత్తం ధర, ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ వడ్డీతో సహా సుమారు రూ. 19.09 లక్షలు అవుతుంది.

ఎవరితో ఎవరికి పోటీ? : హ్యుందాయ్ క్రెటాను మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ లో తీసుకొచ్చింది. ఎంజీ హెక్టర్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మహీంద్రా స్కార్పియో వంటి వాటితో నేరుగా పోటీ పడుతోంది.
