Samsung Galaxy S25 Plus 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 Plus 5G : శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5జీ ఫోన్ భారీగా తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S25 Plus 5G : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ ఇంకా కాలేదు. ఇంతలోనే శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ భారీ ధర తగ్గింపుతో లభ్యమవుతోంది. మీరు ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఎలాంటి బ్యాంక్ కార్డులు లేకుండానే రూ.30వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో రూ.99,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్ గెలాక్సీ S25, గెలాక్సీ S25 అల్ట్రా మధ్య ఉంటుంది. ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 12GB ర్యామ్ మరిన్నింటిని అందిస్తుంది. మీరు ఈ ఫోన్ దాదాపు రూ.68వేలకు లభ్యమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5G ధర : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5G ఫోన్ రూ. 30వేల కన్నా ఎక్కువ తగ్గింపు తర్వాత రూ. 69,799 ధరకు అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,500 తగ్గింపు కూడా పొందవచ్చు. దాంతో ధర దాదాపు రూ. 68వేల వరకు తగ్గుతుంది. అదనంగా, కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ధరను రూ. 44,400 తగ్గించవచ్చు.

కచ్చితమైన వాల్యూ, వర్కింగ్ కండిషన్, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ 3,384 నుంచి ఈజీ ఈఎంఐతో కూడా పొందవచ్చు. మీరు ఎక్కువగా పేమెంట్ చేస్తే ఎక్స్ టెండెడ్ వారంటీ సహా మరిన్ని యాడ్-ఆన్‌లను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5G స్పెషిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2Xతో 120Hz రిఫ్రెష్ రేట్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ ఫోన్ గెలాక్సీ కోసం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది.

12GB (LPDDR5X) ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా సపోర్టు ఇస్తుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్ 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ , 10MP టెలిఫోటో లెన్స్‌తో సహా ట్రిపుల్ లెన్స్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంది.
