Teamindia Squad : రెండేళ్లు భారత జట్టుకు దూరం.. SMATలో వీరబాదుడు.. కట్‌చేస్తే.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు..

Teamindia Squad : వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తోపాటు ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టును

Teamindia Squad : రెండేళ్లు భారత జట్టుకు దూరం.. SMATలో వీరబాదుడు.. కట్‌చేస్తే.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు..

Teamindia Squad

Updated On : December 21, 2025 / 8:43 AM IST

Teamindia Squad : వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తోపాటు ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15మంది సభ్యుల జట్టును శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Also Read : supreme court : మీ భార్యను ఖర్చుల లెక్కలు అడుగుతున్నారా..? ఒక్కసారి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ చూడండి..

టీ20 ఫార్మాట్‌కు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇదే సమయంలో అతని స్నేహితుడు ఇషాన్ కిషన్ రెండేళ్ల తరువాత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం కూడా క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

గిల్‌ను తొలగించడంపై అజిత్ అగార్కర్ స్పందించారు. ‘గిల్ నాణ్యమైన ప్లేయర్. ఆ విషయం మాకు తెలుసు. కానీ, ఇప్పుడు అతను పరుగులు చేయడంలో వెనుకబడ్డాడు. గిల్ దురదృష్టవశాత్తూ గత ప్రపంచ కప్‌లోనూ ఆడలేకపోయాడు. అప్పుడు భిన్నమైన కూర్పుతో వెళ్లాం. ఇప్పుడు కూడా జట్టు కూర్పుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

టీ20 వరల్డ్ కప్ జట్టులో ఇషాన్ కిషన్ ఎంపిక కావడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇషాన్ కిషన్ భారత్ జట్టుకు దూరమై రెండేళ్లు అవుతుంది. రిషబ్ పంత్ ప్రమాదానికి గురవ్వడంతో 2023లో క్రికెట్ ఆడలేదు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు భారత ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత జరిగిన ఆసియా కప్ 2023లో రాణించాడు. దాంతో వన్డే ప్రపంచకప్ 2023కి కూడా ఎంపికయ్యాడు. అయితే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని పక్కన పెట్టారు. ఈక్రమంలో అతను చిన్నచిన్న తప్పులు చేయడం, బీసీసీఐపై దురుసుగా ప్రవర్తించడం వంటి కారణాలతో అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టారు. అయితే, ఇక ఇషాన్ కిషన్ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ, ఊహించనిరీతిలో ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టాడు.

రెండేళ్లపాటు భారత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్.. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడు. తన జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. టోర్నీలో 500కు పైగా పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫైనల్లోనూ ఇషాన్ కిషన్ సెంచరీ బాదాడు. సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. ప్రస్తుతానికి అతడు రెండో వికెట్ కీపర్ గా ఉంటాడు.

ప్రపంచకప్, న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్