Samsung Galaxy M17 5G : భలే డిస్కౌంట్ భయ్యా.. శాంసంగ్ ఫ్యాన్స్ ఇప్పుడే కొనేసుకోండి.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు!

Samsung Galaxy M17 5G : శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ M17 5Gపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌ ఎలా కొనుగోలు చేయాలంటే?

1/5Samsung Galaxy M17 5G
Samsung Galaxy M17 5G:కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? మీరు సరసమైన బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ M17 5జీపై భారీ తగ్గింపును అందిస్తోంది. బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌గా మారింది. కంపెనీ ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌లో అమోల్డ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు, గెలాక్సీ M17 5Gపై అందుబాటులో ఉన్న డీల్స్, స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం..
2/5Samsung Galaxy M17 5G
శాంసంగ్ గెలాక్సీ M17 5Gపై డిస్కౌంట్ : S ఈ శాంసంగ్ M-సిరీస్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 13,999కే ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా లభ్యమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 16,499 ఉండగా.. ఈ ఫోన్ కొనుగోలుపై ఫ్లాట్ రూ. 2,500 తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై కంపెనీ బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
3/5Samsung Galaxy M17 5G
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే.. మీకు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ ఫోన్ ధర రూ. 12,999కి తగ్గుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌ రూ. 13,250 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే, ఈ వాల్యూ అనేది మీ ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
4/5Samsung Galaxy M17 5G
శాంసంగ్ గెలాక్సీ M17 5G ముఖ్య ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ M17 5G అద్భుతమైన డిస్‌ప్లే కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ FHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆకట్టుకునే డిస్‌ప్లే వీడియో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌ కూడా ఉంది. కేవలం 7.5mm మందంతో ఉంటుంది. అదనంగా, ఈ శాంసంగ్ ఫోన్ పవర్‌ఫుల్ ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
5/5Samsung Galaxy M17 5G
ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. శాంసంగ్ ఫోన్‌లో 50MP OIS (F1.8) మెయిన్ వైడ్-యాంగిల్ కెమెరా, 5MP(F2.2) అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు , వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 13MP(F2.0) ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.