Telangana Govt : రైతులకు శుభవార్త.. వాటిని ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం.. సంక్రాంతి నుంచి మొదలు.. తప్పక తీసుకోండి

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ భారతి సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల్లో భూధార్ కార్డులు జారీ చేసేందుకు ..

Telangana Govt : రైతులకు శుభవార్త.. వాటిని ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం.. సంక్రాంతి నుంచి మొదలు.. తప్పక తీసుకోండి

Telangana Govt

Updated On : December 21, 2025 / 10:41 AM IST

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ భారతి సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల్లో భూధార్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల సంక్రాంతి నుంచి భూధార్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read : Gold silver Rates : బంగారం, వెండి కొనేవాళ్లకు శుభవార్త.. నేటి ధరలు ఇవే..

ప్రభుత్వం భూ భారతి సర్వేను నిర్వహిస్తుంది. ఈ సర్వేలో భాగంగా తొలివిడతలో ఐదు రెవెన్యూ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన అధికారులు సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. రెండో విడతలో 373 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేయగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈనెల 18వ తేదీతో ఎన్నికలకోడ్ ముగియడంతో భూభారతి సర్వే ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు మూడో విడత సర్వేలో భాగంగా జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టేలా మొత్తం 2,300 రెవెన్యూ గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. ఇలా మొత్తం ఐదు విడుతల్లో సర్వే ఉంటుంది. సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూధార్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియను సంక్రాంతి పండుగ నుంచి చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

భూభారతి సర్వేలో భాగంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) ద్వారా సేకరించిన డాటాను క్యూజిఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూభారతి ఫోర్టల్లో అప్లోడ్ చేయాలని రెవెన్యూ అధికారులు నిర్దేశించారు. ఇది జీపీఎస్ కంటే మెరుగైన టెక్నాలజీ. దీని ద్వారా భూముల లెక్కలను 1 నుంచి 3 సెంటీమీటర్ల వరకూ ఖచ్చితంగా కొలవొచ్చు. అంటే.. కొలతల్లో తేడా మూడు సెంటీమీటర్లకు మించదు. అంత కచ్చితత్వంతో ఇది ఉంటుంది. దీనితోపాటు డ్రోన్లను కూడా వారి భూమి సరిహద్దులు, సర్వే నెంబర్లు, యాజమాన్య వివరాలను అత్యంత కచ్చితత్వంతో నమోదు చేస్తారు. ఈ వివరాలన్నీ డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.

సర్వే కోసం ప్రభుత్వం ఆధీనంలో ఉ్న సర్వేయర్లతోపాటు లైసెన్స్ సర్వేయర్లను సర్వేకు వినియోగించాలని రెవెన్యూశాఖ నిర్దేశించింది. ఇప్పటికే మొదటి విడతలో 3,500 మంది లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి లైసెన్సులను ప్రభుత్వం జారీ చేసింది. ఎంపికైన లైసెన్సు సర్వేయర్లను ఈ సర్వేలో వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో భూముల సర్వే చేసి ఆధార్ తరహాలో అర్హులైన రైతులకు భూధార్ కార్డులు జారీ చేస్తామని ఇప్పటికే అధికారులు తెలిపారు. భూధార్ కార్డుల రూపంలో పట్టా పాస్ బుక్ లు జారీ చేస్తారు. ఇవి ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు సైజులో ఉంటాయి. ఈ కార్డులో భూమి, రైతు పూర్తి వివరాలు ఉంటాయి.

ప్రభుత్వం ఇచ్చే భూధార్ నంబర్ కార్డులు భవిష్యత్తులో భూ లావాదేవీలు ఈజీగా జరుపుకునేలా చేస్తాయి. భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఇవి కచ్చితమైన లెక్కలతో గందరగోళం లేకుండా చేస్తాయి. అందువల్ల రైతులు సంక్రాంతి నుంచి ఈ కార్డులు తీసుకోవాలి. వీటిని ఎలా ఇవ్వాలి.. ఎలా రైతులకు చేరవెయ్యాలి అనేది త్వరలో ప్రభుత్వం వెల్లడించనుంది.