Shambhala : శంబాల బడ్జెట్ పెరిగిపోయింది.. హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం..

ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజయి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Shambhala)

Shambhala : శంబాల బడ్జెట్ పెరిగిపోయింది.. హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం..

Shambhala

Updated On : December 21, 2025 / 8:19 AM IST

Shambhala : ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాణంలో యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. అర్చన అయ్యర్, శ్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజయి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.(Shambhala)

నిర్మాతలు సినిమా గురించి మాట్లాడుతూ.. కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే ఓకే చెప్పాము. ఆది సాయి కుమార్ తో ముందు వేరే కథ అనుకున్నా ఈ కథ బాగుండటంతో చేసాము. మొదట్నుంచి ఈ సినిమాకు హైప్ వచ్చింది. మొదట తక్కువ బడ్జెట్ అనుకున్నా తర్వాత కథకు తగ్గట్టు బడ్జెట్ పెరిగింది. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసాము. బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరిగినా హై క్వాలిటీతో మంచి సినిమా చేసాము అని అన్నారు.

Also Read : Abhinav Manikanta : హీరోగా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్.. బొమ్మ హిట్ అంటూ..

శంబాలా సినిమా బిజినెస్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే బిజినెస్ తో సేఫ్ జోన్ లో ఉన్నాము. శాటిలైట్, ఓటీటీ రైట్స్ తోనే 80 శాతం రికవరీ అయింది. ఇంకో 20 శాతం థియేటర్ నుంచి వచ్చేస్తాయి. మా సినిమా నచ్చి ఆహా వాళ్ళు ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ కొంచెం కష్టం అనిపించినా మైత్రి వాళ్ళు నైజాం రైట్స్, ఏపీ, సీడెడ్ ఉషా పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు. హిందీలో కూడా వచ్చేవారం రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు.

టైటిల్, సినిమా గురించి మాట్లాడుతూ.. కల్కి వచ్చిన తరువాత శంబాలా అందరికీ తెలిసింది. ఈ కథకు కల్కి, విరూపాక్ష సినిమాలకు సంబంధం ఉండదు. ఈ సినిమాలో శంబాలాకి ఒక మీనింగ్ ఉంది. మా సినిమాలో హారర్ తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ ఉన్నాయి అని తెలిపారు. ఈ సినిమా ఎండింగ్ ప్రాపర్ గా ఉంటుంది కానీ సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చాము అని తెలిపారు.

Also Read : Roshan : తండ్రి కోరిక తీర్చని రోషన్.. శ్రీకాంత్ కోరిక ఏంటో తెలుసా?