Roshan : తండ్రి కోరిక తీర్చని రోషన్.. శ్రీకాంత్ కోరిక ఏంటో తెలుసా?

సినిమాతో పాటు, తండ్రి శ్రీకాంత్ గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Roshan)

Roshan : తండ్రి కోరిక తీర్చని రోషన్.. శ్రీకాంత్ కోరిక ఏంటో తెలుసా?

Roshan

Updated On : December 20, 2025 / 3:20 PM IST

Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ ఆల్రెడీ హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD సినిమాలతో మెప్పించాడు. కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ అనే భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిజాం కాలంలో కథతో ఫుట్ బాల్ స్పోర్ట్ కూడా జత చేసి పీరియాడిక్ గా భారీగా తెరకెక్కింది ఛాంపియన్ సినిమా. ఇటీవలే రామ్ చరణ్ గెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది.(Roshan)

ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోషన్ నేడు మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో సినిమాతో పాటు, తండ్రి శ్రీకాంత్ గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Also Read : Dhurandhar Telugu Release Date : సూపర్ హిట్ ‘దురంధర్’ తెలుగు వర్షన్ కోసం ఎదురుచూస్తున్నారా..? రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ క్రమంలో రోషన్ మాట్లాడుతూ.. నేను మొదట క్రికెటర్ అవ్వాలని అనుకున్నాను. 14 ఏళ్ళ వరకు కూడా క్రికెటర్ అనే అనుకున్నాను. స్కూల్ లో క్రికెట్ ఆడేవాడ్ని. అఖిల్, తమన్ అన్న టీమ్ తో క్రికెట్ ఆడాను. కానీ తర్వాత నటనపై ఆసక్తి వచ్చింది. దాంతో సినిమాల్లోకి వచ్చాను. మా నాన్నకు నన్ను క్రికెటర్ గా చూడాలని కోరిక. కానీ నేను క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి వచ్చాను. మా నాన్న కోరిక తీర్చలేకపోయాను. అప్పుడప్పుడు మ్యాచ్ లు ఆడతను.

మా తమ్ముడు, చెల్లి కూడా మా నాన్న కోరిక తీర్చట్లేదు. మా చెల్లిని డాక్టర్ చేయాలి, తమ్ముడిని IAS చేయాలి అనుకున్నారు నాన్న. తమ్ముడు సినిమాల వైపే ఆసక్తి చూపిస్తున్నాడు. చెల్లి ఇంకా ఏమి డిసైడ్ అవ్వలేదు అని తెలిపాడు. అలా శ్రీకాంత్ రోషన్ ని క్రికెటర్ గా చూడాలి అనుకుంటే రోషన్ మాత్రం హీరో అయ్యాడు. సెలబ్రిటీల మ్యాచ్ లు మాత్రం ఆడుతున్నాడు రోషన్. మరి ఫ్యూచర్ లో ఏదైనా క్రికెటర్ బయోపిక్ లో నటిస్తాడేమో చూడాలి.

Also See : Sridevi : బర్త్ డే స్పెషల్.. కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ఫొటోలు.. చీరకట్టులో క్యూట్ గా..