Dhurandhar Telugu Release Date : సూపర్ హిట్ ‘దురంధర్’ తెలుగు వర్షన్ కోసం ఎదురుచూస్తున్నారా..? రిలీజ్ ఎప్పుడంటే..?

దురంధర్ బాలీవుడ్ లో డిసెంబర్ 5 న రిలీజయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. (Dhurandhar)

Dhurandhar Telugu Release Date : సూపర్ హిట్ ‘దురంధర్’ తెలుగు వర్షన్ కోసం ఎదురుచూస్తున్నారా..? రిలీజ్ ఎప్పుడంటే..?

Dhurandhar

Updated On : December 20, 2025 / 12:35 PM IST

Dhurandhar : ఇటీవల బాలీవుడ్ లో రిలీజయిన స్పై థ్రిల్లర్ సినిమా ‘దురంధర్’. పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ పనిచేసిన ఓ ఏజెంట్ కథతో, రియల్ లైఫ్ లో జరిగిన పాకిస్థాన్ – భారత్ కి చెందిన కొన్ని సంఘటనల నేపథ్యంలో దురంధర్ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, మాధవన్.. కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. (Dhurandhar)

దురంధర్ బాలీవుడ్ లో డిసెంబర్ 5 న రిలీజయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. మన తెలుగు వాళ్ళు మంచి సినిమాలు ఎక్కడున్నా వదిలిపెట్టరని తెలిసిందే. దీంతో దురంధర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం హిందీలోనే రిలీజయింది. ఇప్పటికే పలువురు తెలుగు ప్రేక్షకులు దురంధర్ హిందీ వర్షన్ ని చూసారు. తెలుగులో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

Also Read : Sreenivasan : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ నటుడు, రచయిత కన్నుమూత..

దురంధర్ సినిమా తెలుగులో చూద్దామని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త వచ్చింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. డిసెంబర్ 25 న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేయగా ఆ రోజు దాదాపు 12 తెలుగు సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గారు. తాజా సమాచారం ప్రకారం దురంధర్ సినిమా తెలుగులో న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న లేదా జనవరి 2న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

దీంతో ఈ సినిమా తెలుగులో కూడా భారీగానే వసూలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. దురంధర్ పార్ట్ 2 సినిమా మార్చ్ 2026 లో రిలీజ్ కానుంది.

Also Read : Sridevi : బర్త్ డే స్పెషల్.. కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ఫొటోలు.. చీరకట్టులో క్యూట్ గా..