Sreenivasan : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ నటుడు, రచయిత కన్నుమూత..

మలయాళ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది.(Sreenivasan)

Sreenivasan : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ నటుడు, రచయిత కన్నుమూత..

Sreenivasan

Updated On : December 20, 2025 / 11:18 AM IST

Sreenivasan : తాజాగా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మలయాళం స్టార్ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ మరణించారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసన్ కొచ్చి లోని తన స్వగృహంలో నేడు ఉదయం మరణించారు. 69 ఏళ్ళ వయసులో శ్రీనివాసన్ మరణించారు. దీంతో మలయాళ సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మలయాళ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది.(Sreenivasan)

Also Read : Pavan Kalyan Padala : బిగ్ బాస్ ఫైనల్.. చివరి నిమిషంలో తలకు గాయంతో పవన్ కళ్యాణ్..? సింపతీ కోసం ప్రమోషన్ స్టంటా..?

1976 లో నటుడిగా మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాసన్ 50 ఏళ్లలో దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించారు. రచయితగా కూడా దాదాపు 50 సినిమాలకు పైగా పనిచేసారు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. నేషనల్ అవార్డు తో పాటు అనేక కేరళ స్టేట్ అవార్డులు, మరిన్ని ప్రైవేట్ అవార్డులు సాధించారు శ్రీనివాసన్. ఈయన మరణంతో మలయాళ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయింది.