Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. హిస్టరీ క్రియేట్ చేసిన కామనర్.. ఫ్యాన్స్ సంబరాలు

బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu)లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల సంచలనం క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. హిస్టరీ క్రియేట్ చేసిన కామనర్.. ఫ్యాన్స్ సంబరాలు

Bigg Boss Season 9 title winner is Kalyan Padala

Updated On : December 21, 2025 / 8:48 PM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల సంచలనం క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. తనూజ రన్నరప్ గా నిలిచింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే విన్నర్ కి సంబందించిన షూట్ కూడా కంప్లీట్ అవగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఆర్మీ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో కళ్యాణ్ కి శుభాకాంక్షలు (Bigg Boss 9 Telugu)తెలుపుతున్నారు. అయితే, టైటిల్ కోసం గత రెండు వారాల నుంచి కళ్యాణ్ పడాల, తనూజ మధ్య గట్టి పోటీ జరిగిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టుగా వోటింగ్ జరిగింది. కొన్ని సిచువేషన్స్ లో తనూజ కూడా టాప్ లో నిలిచింది. కానీ, ఫైనల్ గా ఆడియన్స్ మాత్రం కళ్యాణ్ పడాల వైపే మొగ్గు చూపారు. దీంతో, బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా ఒక కామనర్ నిలిచాడు.

Samantha: ట్రెడిషనల్ శారీలో ట్రెండీ లుక్స్.. సామ్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

నిజానికి, అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ పడాల. కానీ, తన ఆట తీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. అంతేకాదు, కొన్నివారాల ముందుకు వరకు కూడా కళ్యాణ్ పైన పెద్దగా అంచనాలు లేవు. కానీ, అనూహ్యంగా గత నాలుగు వారాల నుంచి అతను గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగింది. అవసరమైన చోట తన గళాన్ని వినిపిస్తూ, కొంతమంది కోసం అతను తీసుకున్న స్టాండ్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో నచ్చేసింది. ఇక, టాస్కుల విషయంలో కూడా మనోడు టాప్ అనే చెప్పాలి.

అడుగేసి ముందుకు వెళ్లాడంటే టాస్క్ గెలవాల్సిందే. ఆ రేంజ్ లో టాస్కులను ఆడి దుమ్ములేపాడు కళ్యాణ్. ఇక అతను ఆర్మీ మ్యాన్ ఆ విషయంలో కూడా ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో సపోర్ట్ దొరికింది. ఎంత, ఆ సపోర్ట్ పని చేసిన ప్రవర్తన బాగోలేకపోతే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా. ఒక కామనర్ గా వచ్చిన కళ్యాణ్ పడాల ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు అని చెప్పాలి. ఇక ఈ న్యూస్ తెలియడంతో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.