Honey Face Pack: తేనె ప్యాక్ తో రెట్టింపు అందం.. రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు

తేనె ప్రకృతిచే ప్రసాదించబడిన ఒక అద్భుతమైన(Honey Face Pack) ఔషధం. రుచికి తీయగా ఉండే తేనే ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను అందిస్తుంది.

Honey Face Pack: తేనె ప్యాక్ తో రెట్టింపు అందం.. రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు

Honey Face Pack: Benefits of using honey in a face pack

Updated On : September 7, 2025 / 5:09 PM IST

Honey Face Pack: తేనె అనేది ప్రకృతిచే ప్రసాదించబడిన ఒక అద్భుతమైన ఔషధం. రుచికి తీయగా ఉండే తేనే ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పూర్వకాలం కాలం నుండి ఆయుర్వేదంలో దీనిని దివ్యౌషధంగా వినియోగించారు. ప్రస్తుతం కాలంలో కూడా ఆయుర్వేద వైద్యంలో తేనెను విశేషంగా భావిస్తారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, తేనె కేవలం(Honey Face Pack) ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదు అందం విషయంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. నిజానికి ఇది ఒక సహజమైన హ్యూమెక్టెంట్. ఇది చర్మంలో తేమను నిలుపుకునే శక్తిని కలిగిన ఉండే పదార్థం. కాబట్టి, ఈ మధ్య కాలంలో తేనెను ఫేస్ ప్యాక్ లా కూడా వినియోగిస్తున్నారు. మరి దాని వల్ల కలిగే ప్రయోజనాల గుర్తించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Raw Coconut: పరగడుపున పచ్చి కొబ్బరి తినండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

1.చర్మాన్ని మృదువుగా, తేమతో నింపుతుంది:
తేనె అనేది ఒక సహజ హ్యూమెక్టెంట్. ఇది చర్మంలోని తేమను అలాగే ఉంచేలా చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని తడిగా, మృదువుగా ఉంచేలా చేస్తుంది. శీతాకాలంలో తేనె ప్యాక్‌ వాడటం వల్ల పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 2 నుంచి 3 సార్లు తేనె ప్యాక్ చేసుకోవడం వల్ల చర్మం మెరిసేలా తయారవుతుంది.

2.చర్మం లోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది:
తేనెలో ఉండే సహజ యాంటీబాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు మొహంపై మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గించడంలో విశేషంగా సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు తేనె ప్యాక్‌ను ముఖంపై అప్లై చేసుకుని 15 నిమిషాలు ఉంచి కడగడం వల్ల మొటిమలు, బ్లాక్‌ హెడ్‌లు తగ్గిపోతాయి.

3.చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేస్తుంది:
తేనె చర్మానికి సహజమైన గ్లో ఇవ్వడంలో మెరుగ్గా సహాయపడుతుంది. ఇది చర్మం మీద ఉన్న బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ వంటి మచ్చలను తగ్గించగలదు. తేనెలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌ లా వాడటం వల్ల స్కిన్ టోన్‌ మెరుగుపడుతుంది.

4.చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది:
తేనెలో బాదం పొడి, ఓట్స్ పౌడర్‌తో కలిపి స్క్రబ్‌గా చేయటం వల్ల చర్మంపై ఉండే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. సహజమైన ఎక్స్ఫోలియేటర్లా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.

5.యాంటీఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది:
తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. వయస్సు వల్ల కలిగే చర్మంపై వచ్చే ముడతలు రావడాన్ని ఆలస్యం చేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

* తేనె అలర్జీ ఉన్నవారు ముందు పాచ్ టెస్ట్ చేసుకోవాలి.

* తేనెలో నిమ్మరసం వాడినప్పుడు ఎండలోకి వెళ్లకూడదు

* 100% నేచురల్, మిక్స్ చేయని తేనెను మాత్రమే వాడాలి.