Raw Coconut: పరగడుపున పచ్చి కొబ్బరి తినండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
పచ్చి కొబ్బరికి మన భారతీయ సంప్రదాయ ఆహారంలో(Raw Coconut) విశిష్ట స్థానం ఉంది. దీనిలో అనేకరకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Health benefits of eating raw coconut in the morning
Raw Coconut: పచ్చి కొబ్బరికి మన భారతీయ సంప్రదాయ ఆహారంలో విశిష్ట స్థానం ఉంది. ఇది ఒక సాత్విక, పౌష్టికాహారం. దీనిలో అనేకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆలయ ప్రసాదాలలో, ఇంట్లో పూజల్లో, వంటల్లో కూడా భాగంగా ఉంది. అయితే, (Raw Coconut)తెల్లవారుఝామున పరగడుపున కొబ్బరి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి ఫైబర్, మంచి ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజాలు వంటివి సమృద్ధిగా అందుతాయి. మరి ఆ పోషకాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Brain Health: మెదడు ఆరోగ్యం కోసం ఉదయం ఈ పనులు చేయండి.. జ్ఞానం, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది
1.జీర్ణవ్యవస్థ శుభ్రత, మెరుగైన జీర్ణక్రియ:
పచ్చి కొబ్బరిలో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. దీనిని పరగడుపున తీసుకోవడం వల్ల పేగుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్దకం, బ్లోటింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
2.శక్తివంతమైన శరీరానికి సహకారం:
పచ్చి కొబ్బరిలో మిడిల్ చెయిన్ ట్రైగ్లిసరైడ్స్ (MCTs) అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. ఇవి తేలికగా జీర్ణమై, వెంటనే శక్తిగా మారతాయి. ఉదయం అలసటగా ఉండే వారికి ఇది ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.
3.వైరల్ ఇన్‌ఫెక్షన్స్, బ్యాక్టీరియాకు నిరోధం:
పచ్చి కొబ్బరిలో లౌరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో ఉన్న హానికర బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లను బయటకు పంపడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
4.బరువు నియంత్రణకు సహాయపడుతుంది:
కొబ్బరిలో ఉండే సహజమైన ఫైబర్ & MCTs ఆకలిని తగ్గిస్తుంది. ఇది అధిక ఆహారం తీసుకునే అలవాటును తగ్గించడానికి సహాయపడుతుంది.. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంటుంది.
5.మెదడు ఆరోగ్యానికి మేలు:
కొబ్బరిలో ఉండే సహజ కొవ్వులు మెదడుకు అవసరమైన న్యూట్రియంట్స్ అందిస్తాయి. ఇవి మెంటల్ క్లారిటీ, మెమరీ, ఫోకస్ వంటి వాటిని మెరుగుపరుస్తాయి. కాబట్టి, పరగడుపున పచ్చి కొబ్బరి తినడం, కొబ్బరి నీరు త్రాగడం వల్ల మెదడుకు ఆరోగ్యం లభిస్తుంది.
ఎలా తీసుకుంటే మంచిది:
* ఉదయం లేవగానే, ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి నెమ్మదిగా నమిలి తినాలి.
* కొబ్బరి నీరుతో కలిపి కూడా తినవచ్చు.
* తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు వేరే ఆహారం తీసుకోకూడదు
పాటించాల్సిన జాగ్రత్తలు:
* పచ్చి కొబ్బరి కొంతమందిలో అజీర్ణానికి దారితీయవచ్చు.
* కొవ్వు తగ్గించాలనుకునే వారు పరిమిత మోతాదులో తినాలి
* అలెర్జీ ఉన్నవారు డాక్టర్‌తో సలహా తీసుకోవాలి.