Bitter Gourd Juice: ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగండి: షుగర్ మాయం.. ఆరోగ్యం క్షేమం

కాకరకాయ (Bitter Gourd Juice) మన సంప్రదాయ వైద్యంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే కాకరకాయను ఔషధంగా చెప్తారు.

Bitter Gourd Juice: ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగండి: షుగర్ మాయం.. ఆరోగ్యం క్షేమం

health benefits of drinking bitter gourd juice on an empty stomach

Updated On : September 7, 2025 / 4:19 PM IST

Bitter Gourd Juice: కాకరకాయ అనేది మన సంప్రదాయ వైద్యంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే కాకరకాయను ఆరోగ్యానికి ఔషధంగా చెప్తారు. ఈ కూరగాయల్లో ఉండే బిట్టర్ కంపౌండ్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎన్నో రకాల లాభాలను అందిస్తాయి. ప్రత్యేకంగా ఉదయం ఖాళీ కడుపుతో మరిన్ని ప్రయోజనాలను శరీరానికి అందుతాయి. మరి ఆ(Bitter Gourd Juice) ఆరోగ్యప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Health Tips: అన్నం తినేటప్పుడా.. తిన్నాకనా: నీళ్లు ఎప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిది

1.షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది:
కాకరకాయలో చారంటిన్ (Charantin), పోలిపెప్టైడ్-P, విజనిన్ వంటి సహజ ఇన్సులిన్ పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, ఖాళీ పొట్టతో కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దానివల్ల మధుమేహం నియంత్రణలో ఉండటమే కాదు టైప్ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

2.కాలేయానికి డిటాక్సిఫికేషన్:
కాకరకాయలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు కాలేయాన్ని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో ఈ రాసాన్నీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ, లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. అలాగే, పిత్త సంబంధిత సమస్యలను సైతం తగ్గిస్తుంది.

3.బరువు తగ్గించడంలో సహాయం:
కాకరకాయ జ్యూస్‌లో క్యాలొరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, దీనికి ఫ్యాట్‌ కరిగించే లక్షణాలున్నాయి. ఇది మెటాబాలిజంను వేగవంతం చేస్తుంది. అలాగే బరువు తగ్గే ప్రక్రియను సపోర్ట్ చేస్తుంది.

4.చర్మ ఆరోగ్యానికి ఉపయోగం:
కాకరకాయలో ఉండే విటమిన్ C, యాంటీబాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉచడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగడం వల్ల రక్తంలో విషకారక పదార్థాలు శరీరం నుంచి బయటకు పోయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి.

5.పేగుల శుభ్రత:
కాకరకాయ జ్యూస్‌లో ఉండే న్యాచురల్ లాక్సేటివ్ ప్రాపర్టీలు పేగుల పనితీరును పెరుగుపరచడంలో సహాయపడతాయి. ఖాళీ పొట్టతో ఈ జ్యూస్ తాగితే అజీర్తి, కబ్జి, పేగుల్లో మలినాల వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా.. పేగుల్లో పేరుకుపోయి క్రిములను సైతం ఇది తొలగించగలదు.

పటిచవలసన జాగ్రత్తలు:

* గర్భిణీలు, పిల్లలు వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.

* రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది

* రోజు 100 మిలీ లీటర్లు కన్నా ఎక్కువ తీసుకోకూడదు

* ఉదయం లేచిన 15 నుంచి 20 నిమిషాల తర్వాత తాగాలి

* తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు ఎం తినకూడదు

* రుచి కోసం నిమ్మరసం, తేనె వాడవచ్చు.