Cauliflower: కాలీఫ్లవర్ ఆరోగ్య ప్రయోజనాలు: గుండె, మెదడుకు ఆరోగ్యం.. కేవలం ఇలా మాత్రమే తినండి
కాలీఫ్లవర్ అనేది పుష్కలంగా పోషకాలతో ఉండే కూరగాయ. (Cauliflower)భారతీయ వంటకాలలో, పులావుల్లో, వేపులల్లో ఎక్కువగా వాడతారు.

Health benefits of eating cauliflower every day
Cauliflower: కాలీఫ్లవర్ అనేది పుష్కలంగా పోషకాలతో నిండి ఉండే ఒక కూరగాయ. భారతీయ వంటకాలలో, పులావుల్లో, వేపులల్లో ఈ కూరగాయను ఎక్కువగా వాడతారు. రుచిగా ఉండటం వల్ల దీనిని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ కూరగాయ కేవలం రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ కూరగాయను రోజువారీ ఆహరంలో చేర్చుకోవడం వల్ల అనేకరకాల ప్రయోజనాలు అందిస్తాయి. మరి ఆ కాలీఫ్లవర్(Cauliflower) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Raw Coconut: పరగడుపున పచ్చి కొబ్బరి తినండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
1.అద్భుతమైన పోషక విలువలు:
కాలీఫ్లవర్‌లో విటమిన్ C, K, B6, ఫోలేట్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది లో కేలరీలతో పాటు అధిక పోషకాలు ఉందటఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపికగా చెప్తారు/.
2.జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
కాలీఫ్లవర్‌లో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, కబ్జి సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
3.క్యాన్సర్ రాకను తగ్గిస్తుంది:
కాలీఫ్లవర్ ఒక క్రూసిఫెరస్ కూరగాయ. ఇందులో గ్లూకోసినోలేట్స్, ఇండోల్-3-కార్బినాల్ లాంటి యాంటీ–క్యాన్సర్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
4.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:
కాలీఫ్లవర్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా సల్ఫొరాఫేన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తనాళాల్లో దెబ్బతినే అవకాశాన్ని తగ్గిస్తుంది.
5.మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది:
కాలీఫ్లవర్‌లో ఉండే చోలిన్ అనే పోషక పదార్థం మెదడు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మొదటి 1000 రోజుల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, మెమొరీ, ఏకాగ్రత, మనశాంతికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్య సూచనలు:
* కాలీఫ్లవర్‌ను ఉడికించి, తక్కువ మసాలా తో వండితే మంచి పోషకాలు అందుతాయి.
* మితంగా తినడం మంచిది.
* ఎక్కువగా తింటే గ్యాస్, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.