RRR: ఆర్ఆర్ఆర్ బుకింగ్స్.. ఎక్కడ.. ఎలా..?

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీని....

Rrr Pre Booking Details

RRR: మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీని క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, తారక్-చరణ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తుండటంతో ఆర్ఆర్ఆర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా ప్రీబుకింగ్ సేల్స్‌లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. మరి పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రీబుకింగ్స్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయో ఓసారి లుక్కేద్దామా..

ఆర్ఆర్ఆర్ చిత్రానికి తెలుగునాట అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని ఇప్పటికే జరుగుతున్న ప్రీబుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. అటు తమిళనాట కూడా ఈ సినిమాకు మంచి ప్రీబుకింగ్స్ జరుగుతున్నాయి. తమిళంలో ఈ సినిమాకు మంచి క్రేజ్ రావడంతో తమిళనాట.. ముఖ్యంగా చెన్నై సిటీలో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. తమిళంలో ప్రస్తుతం బడా సినిమాలేవీ లేకపోవడంతో ఆర్ఆర్ఆర్‌కు అడ్వాంటేజ్ ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్‌ఆర్?

మలయాళంలోనూ ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఈ సినిమాకు అక్కడ కూడా మంచి గిరాకే అవుతుంది. అయితే ఇది కేవలం ఫస్ట్ డే వరకే ఉంటుందా లేక వీకెండ్ వరకు ఈ క్రేజ్ కొనసాగుతుందా అనేది తొలిరోజు టాక్‌ను బట్టి తేలిపోతుంది. కానీ కర్ణాటకలో మాత్రం ఈ సినిమాకు అనుకున్నమేర ఆదరణ లేదని తెలుస్తోంది. ఈ సినిమాను కన్నడ భాషలో అనుకున్న స్థాయిలో రిలీజ్ చేయకపోవడం ఒక కారణం అయితే, హీరో పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ను థియేటర్ల నుండి తీసేయొద్దనే డిమాండ్ కారణంగా ఆర్ఆర్ఆర్‌కు అక్కడ గడ్డుకాలం తప్పదని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక నార్త్ విషయానికి వస్తే.. ఈ సినిమాను నార్త్‌లో భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ అక్కడి జనానికి ఈ సినిమాలోని క్యాస్టింగ్‌లో కేవలం ఆలియా భట్, అజయ్ దేవ్గన్‌లు మాత్రమే తెలియడం.. మిగతా నటీనటులెవరికీ పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఈ సినిమాకు అక్కడ ఆదరణ అనుకున్న మేర లేదనే చెప్పాలి. అయితే ఆలియా భట్‌పై బాలీవుడ్ జనంలో చాలా వ్యతిరేకత ఉందనే విషయం తెలిసిందే. ఈ కారణం చేత కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై బజ్ క్రియేట్ కాలేదని అంటున్నారు. ఇక కరోనా కారణంగా చాలాసార్లు వాయిదా పడ్డ చిత్రం కావడంతో ఈ సినిమాను బాహుబలి మేకర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడని, నార్త్ ఆడియెన్స్‌లో చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కారణంతో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రానికి నార్త్‌లో అనుకున్న స్థాయిలో ప్రీబుకింగ్స్ జరగడం లేదు.

RRR రిలీజ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్

అటు ఓవర్సీస్‌లోనూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి కళ్లుచెదిరే విధంగా ప్రీబుకింగ్స్ జరుగుతున్నాయి. కానీ అక్కడ కేవలం తెలుగు భాషలో మాత్రమే సినిమాకు ఆదరణ దక్కుతుందని, మిగతా భాషలను అక్కడి జనం కనీసం పట్టించుకోవడం లేదని ప్రీబుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది.

మరి ఇన్ని అడ్డంకులను అధిగమించి, ఈ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణను అందుకుంటుందా.. వసూళ్ల పరంగా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుందా.. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా అక్కడ కూడా పుంజుకుంటుందా అనేది తెలియాలంటే.. ఆర్ఆర్ఆర్ మొదటి బొమ్మ పడేవరకు వెయిట్ చేయాల్సిందే.