హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో యువతుల దందా, స్వచ్చంద సంస్థ పేరుతో వసూళ్లు

young women collecting money in ghatkesar: హైదరాబాద్ ఘట్ కేసర్ లో స్వచ్చంద సంస్థ పేరుతో అమ్మాయిలు చందాలు వసూలు చేయటం కలకలం రేపింది. చందాలు వసూలు చేస్తున్న రాజస్తాన్, గుజరాత్ కి చెందిన ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన ఆరుగురు అమ్మాయిలు బృందాలుగా ఏర్పడి వాహనదారుల నుంచి డబ్బు వసూలు చూస్తున్నారు.

స్వచ్చంద సంస్థ పేరు చెప్పాలని వాహనదారులు అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. పైగా, డబ్బు ఇవ్వని వారిని బెదిరిస్తున్నారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపైన పోలీసులు లేని చోట నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఈ దందా చేస్తున్నారు. వాహనాలు ఆపి స్వచ్చంద సంస్థ పేరుతో చందాలు వసూలు చేస్తున్న యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల గుంటూరులోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వారితో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. వారికి డబ్బు ఇవ్వొద్దని సూచించారు. ఎవరికైనా ఇలాంటి వారు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు చెప్పారు.