రోజులో ఒక్కోటైంలో సెక్స్‌కు ఒక్కో ఎఫెక్ట్: ఉదయం 6కి సంతానోత్పత్తి, రాత్రి 8కి తెలివితేటలు, 10గంటలకు హాయిగా నిద్ర

మీరు రాత్రిపూట చురుగ్గా ఉంటారా? లేదంటే కోడికూతతోనే లేస్తారా? మీరు ఎప్పుడు సెక్స్ చేస్తారు? ఈ టైంను బట్టే మీకు హెల్త్ లాభాల్లో తేడాలున్నాయని అంటున్నారు సైంటిస్ట్‌లు. Anglia Ruskin University ఇటీవల చేసిన సర్వే ఇలా ఉంది. రెగ్యులర్ సెక్స్ లేకపోవడం 50ఏళ్లు దాటిన వాళ్లలో అనారోగ్యాన్ని పెంచుతుంది. ఒక్కో సమయంలో సెక్స్ చేయడం ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుందా? అవునని అంటోంది స్టడీ.

06:00 పిల్లలు పుట్టే అవకాశాలెక్కువ                  
మీకు పిల్లలు కావాలనుకొంటే, తెల్లవారుజుమున రొమాన్స్ కోసం ఫోన్‌లో అలారమ్ పెట్టుకోండి. ఉదయం శృంగారంలో పిల్లలు పుట్టే అకాశాలు ఎక్కువ అవుతాయంట. Zurichలోని రీసెర్చ్ ప్రకారం ఉదయం పూట  వీర్యకణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటాయి.

 

సాయంత్రం అవుతున్నకొద్దీ వాటిలో చురుకుదనం తగ్గిపోతుంది. అంటే ఎంత ఉదయం సెక్స్‌చేస్తే అంతగా పిల్లలు పుట్టే అవకాశాలున్నాయని చాలా పరిశోధనలు భరోసానిస్తున్నాయి.

అంత ఉదయం రొమాన్సా? నిద్రమత్తులో కష్టమనుకొంటే కనీసం ఏడున్నరకైనా బెటర్ అన్నది స్టడీమాట. బ్రిటన్ సైకాలజిస్ట్‌లు రొమాన్స్‌కోసం 2020లో కొత్త ఐడియా ఇస్తున్నారు. స్నానం చేసి, అఫీస్ కెళ్లడానికి ముందు భాగస్వామితో చేసే సెక్స్… ఊపునిస్తుంది. ఎందుకని? సెక్స్ చేసినప్పుడు హ్యాపీ హార్మోన్స్ ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి రోజంతా… హ్యాపీగా నడుస్తుందన్నది వాళ్ల మాట.

 

07:30 మగాళ్ల  లైంగిక ఆరోగ్యానికి మంచింది
బెడ్ మీద కళ్లుతెరిచిన వెంటనే మగాళ్లకు ఓ ఉత్తేజం వస్తుంది. భాగస్వామి ఒప్పుకొంటే మరోసారి అన్న ఫీలింగ్. ఈ విషయం పెళ్లయిన అమ్మాయిలకు బాగా తెలుసు.  దీనికో  సైన్స్‌రీజన్ ఉంది. ఉదయం 8లోపు, మగాళ్లలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువ. ఒకవేళ అమ్మాయికనుక మగాడ్ని ఎంకరేజ్ చేస్తే ఇద్దరికీ మంచి అనుభూతినిచ్చే సమయమిది. లాంగ్ టర్మ్ రిలేషన్స్‌లో రిమాన్స్ మంచి టానిక్ అని హార్వార్డ్ యూనివర్సటి సైకాజలిస్ట్‌లకూ తెలుసు.

పదేళ్ల క్రితం నాటి స్టడీ ఓ గొప్ప విషయం చెప్పింది. వారానికి ఒక్కరోజైనా సెక్స్ లేకపోతే 50 ఏళ్లుదాటిన మగాళ్లకు అంగస్థంభన (erectile dysfunction)సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. తోడే బావిలోనే కదా నీరు ఊరేదని పెద్దోళ్లు చెబుతారు. ఇంకో గొప్ప సంగతి. ఉదయాన్నే మగాడి మజిల్స్ చాలా యాక్టీవ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంటే..స్టామినా ఎక్కువే కదా!  మనం అంత లాంగ్ రన్నర్స్ కాదు బాస్ అనుకొనే మగాళ్లు, మార్నింగ్ ట్రై చేస్తే బెటర్ .

 

08:30 వ్యాధినిరోధక వ్యవస్థకు మంచిది
సెక్స్ ను రాత్రికే పరిమితం చేస్తారుకాని, మధ్యాహ్నం ఉత్సాహం ఎక్కువే. ఈ సమయంలో శృంగారం ఇమ్యూన్ సిస్టమ్‌కి బూస్ట్ అంట. పోనీ పూర్తిగా రొమాన్స్‌ను ఎంజాయ్ చేసే ఉద్దేశం లేదు. అలాగని వద్దనుకోవద్దు. మీ పార్టనర్ కి సాయం చేయండి. మీకు హుషారు ఉండి, మీ పార్టనర్ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి… బరిలోకి దిగండి.

రెగ్యులర్‌గా మార్నింగ్ రొమాన్స్‌తోపాటు, తరచు క్లైమాక్స్‌చేరితే  immunoglobulin లెవిల్స్ పెరుగుతాయి. ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకొనే యాంటీబాడీలు తయారవుతాయి. fluలాంటి రోగాలను తట్టుకోవచ్చు. ఇంతకీ రొమాన్స్ ఎక్కడ బెటర్? షవర్‌లో ట్రై చేస్తే బెటర్ అంట. అదీ చన్నీళ్ల స్నానమైతే… బాడీ చాలా యాక్టీవ్ అవుతుంది.

 

12:00 ఒత్తిడి నుంచి రిలీఫ్
వర్క్ ఒత్తిడిని నుంచి తప్పించుకోవాలంటే ఫ్రెండ్స్‌తో జోక్స్ వేయడంకాదు. లంచ్‌ టైంలో దుప్పట్లోకి దూరమంటున్నారు పరిశోధకులు. Georgia State University పరిశోధకులు అమెరికా జంటలపై చేసిన స్టడీ కొత్తసంగతిని చెప్పింది.

రెగ్యులర్‌గా సెక్స్‌చేస్తే systolic blood pressure తగ్గితుంది. ఆఫీసులో ఉంటే భయం, టెన్సన్ తగ్గిపోతుంది. అలాగని గంటలకొద్దీ రొమాన్స్ అక్కర్లేదు. క్విగ్‌గా రొమాన్స్ కానిస్తే వర్క్ పట్ల ఉత్సాహంపెరుగుతుంది. పెద్ద టాస్క్‌లను సులువుగా చేసేస్తారు. చాలామంది CEOలు మధ్యహ్ననం రెస్ట్‌సమయంలో పార్టనర్ తో‌రొమాన్స్ చేస్తారని సైకాలజిస్ట్ లకు తెలుసు.

 

15:00 గుండె ఆరోగ్యానికి మంచిది
ఆనందం మనసు మంచిదని అందరికీ తెలుసు. అదే రొమాన్స్ ఐతే ఇంకా గుడ్‌ఫీలింగ్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ సమయంలో మగ, ఆడ హార్మోన్స్ సరైన‌పాళ్లలో ఉంటాయి. మూడుగంటల సమయంలో సెక్స్‌వల్ల  post-coital hormone oxytocin ఒకేసారి రిలీజ్ అవుతుంది. దీనివల్ల అనుబంధం, అప్యాయత, ఇంకా ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతంది. ఇది హెల్త్ కి మంచిదేకదా. దీనివల్ల హార్ట్‌సమస్యలకు కారణమైయ్యే stress chemicalcortisol లెవెల్స్ తగ్గుతుంది. మీకు గుండెనొప్పి అంత త్వరగా రాదు.

 

19:00 గొప్ప orgasm అనుభూతి
ఈవినెంగ్ ఆఫీసునుంచి వచ్చిన బైటకెళ్లకుండా సోఫీ మీద పార్టనర్‌తో చేసే రొమాన్స్ గొప్ప ఫీలింగ్‌నిస్తుందన్నది ఫ్రాన్స్ పరిశోధకుల మాట. Texasలో జరిగిన మరో స్టడీలో అమ్మాయిలకు ఏడుగంటల సమయంలో బ్డడ్ ఫ్లో 169 ఎక్కువ. అందువల్ల ప్రైవేట్ పార్టులు బాగా సెన్సిటీవ్ గా ఉండి… రొమాన్స్‌ను గొప్పగా ఎంజాయ్ చేస్తారు. ఫాస్ట్, స్ట్ట్రాంగర్ ఆర్గజమ్ కి ఇదో బెస్ట్‌టైం అని తేల్చేస్తున్నారు. నమ్మకపోతే మీరూ ట్రైచేయొచ్చు. రెగ్యులర్ ఆర్గజమ్ వల్ల వయస్సువల్ల వచ్చే డ్రైనెస్ తగ్గిపోతుంది. స్కిన్ స్మూత్ గా ఉంటుంది. యంగ్ గా కనపించాలని ఎవరికి ఉండదు?

 

20:00  షార్ప్ బ్రెయిన్
మీ వయస్సు 40 దాటింది. sleep cycle మారిపోతోంది. తొందరగా పడుకొని, ఉదయం ఆరుకే లేస్తున్నారు. దానర్ధం మీరు నైట్‌రొమాన్స్‌ను వదులుకొంటున్నట్లే. ఆ పనిచేయకండి. వయస్సుపెరుగుతున్నప్పుడు హుషారుతగ్గుతుంది. దీనికో ముందుంది. అదే రాత్రిపదిగంటలకు శృంగారం. రెగ్యులర్ సెక్స్ లేకపోతే తెలివితేటలు తగ్గిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా సెక్సాలజిస్టులు మొత్తుకొంటోంది ఇదే. శృంగారం వల్ల బ్రెయిన్ యాక్టీవ్ గా ఉంటుంది. బ్రెయిన్ లో information retentionకు కారణమైయ్యే hippocampus బ్రెయిన్‌లో ఓ పార్ట్. మీకు ఐక్యూ పాయింట్లు పెరగాలంటే పదిగంటలకు శృంగారం గొప్ప ఔషధం.  

 

22:00 గాఢ నిద్ర
ORGASM వల్ల  prolactin,melatonin హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఈరెండింటికి ఓ శక్తి ఉంది. నిద్రపుచ్చగలవు…మనస్సును శాంతింపచేయగలవు. అవి  endorphinsను రిలీజ్ చేస్తాయి. వాటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. అన్నీమర్చిపోతారు, హ్యాపీగా నిద్రపోతారు. కాకపోతే ఏదో చేశాంలే అనుకొంటే సరిపోదు. మీరు క్లైమాక్స్‌కు చేరాలి.  ఒకవేళ అసంతృప్తితో పనిముగిస్తే సీన్ రివర్స్.  cortisol, adrenalinలు బ్లడ్ లో కలుస్తాయి. మీకు నిద్రుండదు.
 

ట్రెండింగ్ వార్తలు