Covid Vaccine: కొవిడ్ మృతుల్లో 99శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే

కొవిడ్ మృతులని బట్టి చూస్తుంటే వ్యాక్సిన్ పనితీరు ఎంత మెరుగ్గా ఉందో అర్థమవుతోంది. ప్రత్యేకించి పెద్ద వాళ్లల్లో.. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో చనిపోయిన వాళ్లు దాదాపు అంతా వ్యాక్సినేషన్ చేయించుకోని వారే...

Covid Vaccine

Covid Vaccine: కొవిడ్ మృతులని బట్టి చూస్తుంటే వ్యాక్సిన్ పనితీరు ఎంత మెరుగ్గా ఉందో అర్థమవుతోంది. ప్రత్యేకించి పెద్ద వాళ్లల్లో.. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో చనిపోయిన వాళ్లు దాదాపు అంతా వ్యాక్సినేషన్ చేయించుకోని వారే ఉన్నారంటూ సీడీసీ డైరక్టర్ డా. రాచెల్లె వాలెన్‌స్కీ అంటున్నారు. కొత్త కేసులు రాకముందే వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

ఈ రిపోర్టుల ప్రకారం.. అమెరికా ప్రత్యేకమైన గోల్ పెట్టుకుంది. 70శాతం మంది అమెరికన్లు జులై 4కల్లా వ్యాక్సిన్ వేయించుకోవాలి. 18ఏళ్లు పైబడ్డ వారు 56శాతం మంది అమెరికన్లు పూర్తి వ్యాక్సినేషన్ వేయించుకోగా 66శాతం కనీసం ఒక్క డోస్ తీసుకున్నవారు ఉన్నారు.

ఇండియాలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయింది. వేల సంఖ్యలో మాత్రమే మొదలైన వ్యాక్సినేషన్ లక్షల్లో నమోదవుతూ.. రోజుకు దాదాపు కోటి మందికి వ్యాక్సిన్ వేయగలుగుతున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే మిక్స్ డ్ వ్యాక్సిన్ పై సత్ఫలితాలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. విదేశాల్లో జరిగిన ఈ ప్రయోగం సక్సెస్ అవడంతో ఈ వైపే మొగ్గు చూపుతున్నారు ఇండియన్లు కూడా.