COVID-19 ఇన్ఫెక్షన్.. అత్యంత తీవ్రమైన అంటువ్యాధిగా ఎప్పుడు మారుతుందంటే?

చరిత్రలో అంటువ్యాధులు ఎలా అంతమయ్యాయో తెలుసుకోగలిగితే.. భవిష్యత్తులో కొవిడ్-19 మహమ్మారి అంతం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

COVID-19 infection most contagious : ప్రపంచవ్యాప్తంగా కరోనా (COVID-19) మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్-19 వాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గడం లేదు. కొత్త కరోనా వేరియంట్ వేవ్‌లు పుట్టుకొస్తున్నాయి. మహమ్మారులుగా విజృంభిస్తున్నాయి. ఇలాంటి మహమ్మారులు మానవాళికి ఏం కొత్తకాదు. మన పూర్వీకులు ఇలాంటి అత్యంత అంటురోగాలను ఎదుర్కొన్నారు. కొన్ని మహమ్మారులతో ఇప్పటికీ మనతో సహజీవనం చేస్తూనే ఉన్నాం. కానీ మహమ్మారిగా ప్రపంచాన్ని వణికించిన కొన్ని అంటువ్యాధులు కాలక్రమేణా అంతమైపోయాయి. చరిత్రలో అంటువ్యాధులు ఎలా అంతమయ్యాయో తెలుసుకోగలిగితే.. భవిష్యత్తులో కొవిడ్-19 మహమ్మారి అంతం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

COVID-19 ప్రతి వేవ్ ద్వారా వ్యాప్తిచెందే ఇన్‌ఫెక్షన్ ఎంత తీవ్రంగా వ్యాపిస్తుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ, వైరస్ సోకిన వ్యక్తి ఏ స్థాయిలో అత్యంత తీవ్రమైన అంటువ్యాధికి కారణం అవుతాడనేది ఇప్పటికీ క్లారిటీ లేదంటున్నారు నిపుణులు. ఆ వ్యక్తి నుంచి వైరస్ ఎప్పుడూ ఎలా వ్యాప్తి చెందే అవకాశం ఉందో గుర్తించలేమని బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్.. అత్యంత తీవ్రంగా ఎప్పుడు మారుతోందో తెలుసుకునేందుకు రీసెర్చర్లు ఒక కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు.

Credit : Taken from Google Images

వైరస్ సోకిన మొదటి ఐదు రోజుల్లోనే :
వైరస్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది. అది రెండు రోజుల నుంచి మూడు రోజుల తర్వాత అత్యంత అంటువ్యాధిగా మారుతుందని కనుగొన్నారు. అంటే.. వైరస్ సోకిన మొదటి ఐదు రోజుల్లోనే అంటువ్యాధిగా మారిపోతుందని తేల్చారు. దీనికి సంబంధించి అధ్యయనాన్ని JAMA ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించారు. వ్యాధి సోకిన వ్యక్తుల్లో ప్రాథమిక లక్షణం బయటకు కనిపించదు. వారిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లానే ఉంటారు. కానీ, ఆ సమయంలోనే వైరస్ మహమ్మారిగా తీవ్రరూపం దాల్చేందుకు సమయమని పరిశోధకులు తేల్చేశారు. మరి.. అంటువ్యాధిని నియంత్రించలేమా అంటే.. అందుకు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే వారికి టెస్టు చేయించాలి. వారిని ఇతరులతో కలవకుండా ఐసోలేషన్ లో ఉంచడమనేది ఒక కీలకమైన దశగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్కొన్నారు.
 Jammu : కరోనా రెండో డోస్ తీసుకున్న బామ్మ, ఈమె వయస్సు ఎంతో తెలుసా ?

అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం.. కరోనా సోకిన వారికి సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్ చేసింది. జనవరి 2020 నుంచి ఆగస్టు 2020 వరకు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో సుమారు 9వేల ప్రాథమిక కేసుల్లో దగ్గరి కాంటాక్టుల్లో కరోనా వ్యాప్తిపై అధ్యయనం నిర్వహించింది. దగ్గరి కాంటాక్టుల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ఆస్పత్రుల్లో పనిచేసే వ్యక్తులు, వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు ఇలా అందరిని ట్రేసింగ్ చేశారు. ప్రాథమిక కేసులుగా గుర్తించిన వ్యక్తులలో 89 శాతం మంది తేలికపాటి లేదా సాధారణ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. 11 శాతం మందిలో మాత్రమే ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. వారిలో ఎవరూ తీవ్రమైన లక్షణాలు లేవు. ఒకే ఇంట్లో దగ్గరగా ఉండేవారిలో ఎక్కువగా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని తేలింది.

Credit : Taken from Google Images

వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించడానికి ముందు నుంచి ఆ తర్వాత కనిపించాక సన్నిహితంగా ఉన్నవారికి కరోనా వైరస్ సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది. తేలికపాటి లక్షణాలు లేదా సాధారణ రోగలక్షణ వ్యక్తులతో పోలిస్తే.. అసిమ్టమాటిక్ ప్రాథమిక వ్యక్తుల కాంటాక్టుల్లో కరోనా వ్యాప్తికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి వారినుంచి వైరస్ సోకితే.. ఇతరుల్లోనూ కరోనా లక్షణాలు కనిపించే అవకాశం తక్కువగానే ఉండొచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.
India Covid-19 : కరోనా కల్లోలం.. నిన్న వైరస్ సోకిన వాళ్లలో 50 శాతం మంది తొలి డోసు తీసుకున్నవాళ్లే!

ట్రెండింగ్ వార్తలు