Jammu : కరోనా రెండో డోస్ తీసుకున్న బామ్మ, ఈమె వయస్సు ఎంతో తెలుసా ?

వ్యాక్సిన్ తీసుకోవడానికి వయస్సు సంబంధం లేదని నిరూపించిందో బామ్మ. ఈమె వయస్సు ఎంత అనుకున్నారు ? 120 ఏళ్లు.

Jammu : కరోనా రెండో డోస్ తీసుకున్న బామ్మ, ఈమె వయస్సు ఎంతో తెలుసా ?

Jammu

Smt. Dholi Devi : ప్రపంచవ్యాప్తంగా ఇంకా కరోనా భయపెడుతూనే ఉంది. వైరస్ అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలు ఇస్తున్నాయి. కానీ..కొన్ని దేశాల్లో ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఒక్కరోజులోనే కోటి డోసులు పంపిణీ చేసి అరుదైన రికార్డు కొట్టేసింది.

Read More : Ganesh Festival : సెప్టెంబర్ 10న గణేష్ ఉత్సవాలు

ఒక్కరోజే ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం భారత్ లో ఇదే తొలిసారి. అయితే..కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఇంకా వెనుకంజ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకొంటే జ్వరం వస్తుందని, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయనే భయంతో తీసుకోవడం లేదు. ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే..వ్యాక్సిన్ తీసుకోవడానికి వయస్సు సంబంధం లేదని నిరూపించిదో బామ్మ. ఈమె వయస్సు ఎంత అనుకున్నారు ? 120 ఏళ్లు.

Read More : Pierce Fruit : శరీరానికి పోషకాలనిచ్చే పియర్స్ పండు

జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా దుదు పంచాయత్ లో ధోలి దేవి 120 ఏండ్ల వయస్సున్న బామ్మ నివాసం ఉంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా..మొదటి డోస్ తీసుకున్నారు. అయితే..రెండో డోస్ తీసుకోవాల్సి ఉంది. 2021, ఆగస్టు 28వ తేదీన దేశ వ్యాప్తంగా ఒక్కరోజు కోటి మంది వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా..ఈ బామ్మకు రెండో డోస్ వేయడానికి ఆరోగ్య సిబ్బంది..ఎత్తైన ప్రదేశంలో నివాసం ఉండే ఈ బామ్మ ఇంటికి చేరుకున్నారు. అనంతరం 120 ఏళ్ల ధోలిదేవికి రెండో డోస్ ఇచ్చారు. ఇంట్లో వ్యాక్సిన్ తీసుకున్న వీడియోను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Read More : Bride Bill : పెళ్లికి రాలేదని..! ఫ్రెండ్ కు రూ.17వేల బిల్లు పంపిన వధువు

ఒక్కరోజులోనే కోటి డోసులు పంపిణీ చేసి అరుదైన రికార్డు కొట్టేసింది. ఒక్కరోజే ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం భారత్ లో ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం రాత్రి 10గంటల వరకు దేశ వ్యాప్తంగా కోటీ అరవై నాలుగు వేలకు పైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 62కోట్ల డోసుల టీకా పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 4.05 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో చైనా ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది.