Love Story: తల్లిదండ్రులకు షాక్.. కళ్లముందే ప్రియుడితో కూతురు జంప్

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆ తర్వాత ఆమె ప్రియుడితో కనిపించడంతో ఉద్వేగానికి లోనయ్యారు.

Love Story: తల్లిదండ్రులకు షాక్.. కళ్లముందే ప్రియుడితో కూతురు జంప్

Kakinada

Kakinada Parents : అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆ తర్వాత ఆమె ప్రియుడితో కనిపించడంతో ఉద్వేగానికి లోనయ్యారు. తమను మోసం చేస్తావా అంటూ ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఆ జంటను అడ్డుకోబోయారు. అయితే యువతి తల్లిదండ్రులను పక్కకు తప్పించి ఆమెను ఓ సినిమా రేంజ్‌లో అక్కడి నుంచి తీసుకెళ్లాడు ప్రేమికుడు. ఈ ఘటన కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది.

Read More : Tomatoes : టమాటో లో శనగపచ్చ పురుగు నివారణ

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువతి.. కాకినాడ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వీరిద్దరు 40 రోజుల క్రితం వివాహం చేసుకునేందుకు కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్నారు. వారిద్దరూ శుక్రవారం వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని.. ఆమెను తమతో రావాలంటూ బ్రతిమిలాడారు.

Read More :Hotstar: హాట్‌స్టార్ అన్ఇన్‌స్టాల్ చేస్తున్న యూజర్లు.. ట్విట్టర్‌లో ట్రెండింగ్!

దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని గమనించిన యువకుడు యువతిని కార్యాలయం గేటు బయటకు తీసుకువచ్చాడు. అప్పటికే అక్కడ కారుతో అతడి స్నేహితులు సిద్ధంగా ఉండగా… యువతిని కారులోకి ఎక్కించి, తానూ కదులుతున్న వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న యువతి తల్లిదండ్రులు కారును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది.