Tomatoes : టమాటో లో శనగపచ్చ పురుగు నివారణ

పొలంలో శనగపచ్చ పురుగు ఆశించిందని గమనించిన వెంటనే అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. టమోటో పంట మధ్యమధ్యలో అక్కడక్కడ బంతి మొక్కలను నాటుకోవాలి.

Tomatoes : టమాటో లో శనగపచ్చ పురుగు నివారణ

Tomato (1)

Tomatoes : కాయగూర జాతి మొక్కల్లో టమాటో ముఖ్యమైనది. ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే టమాటోను అన్నిరకాల కూరల్లో విరివిగా వినియోగిస్తారు. శీతాకాలంలో టమోటో పంట సాగుచేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇటీవలి కాలంలో రైతులకు మంచి దిగుబడినిచ్చే మేలు జాతి టమోటో రకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగం ఎక్కవగా ఉండటంతో మార్కెట్లో టామోటోకు నిరంతరం డిమాండ్ ఉంటుంది.

టమోటో సాగుచేసే రైతులు ప్రధానంగా దాని సస్యరక్షణపై అవగాహన కలిగి ఉండటం మంచిది. సున్నితమైన ఈ పంటకు తెగుళ్లు, పురుగులు బెడద ఎక్కువగానే ఉంటుంది. టమాటా పంట వేసిన 15 – 20 రోజుల దశలో శనగ పచ్చ పురుగు ఆశిస్తుంది. సమీపపొలాల్లో కందిపంట సాగు చేస్తుంటే అక్కడి నుండి టమోటో పైరుకు ఈ పురుగు ఆశించే అవకాశాలు అధికంగా ఉంటాయి. టమోటో చెట్టు లేత ఆకులను ఈ పురుగు తినేస్తుంది. పురుగు పెరుగుతున్న కొద్దీ దాని ఉదృతి అధికంగా ఉంటుంది. తొలుత ఆకులకే పరిమితమై ఆతరువాత కాయలకు రంధ్రాలు చేసి కాయ లోపలి గుజ్జును తినేస్తుంది. దీనివల్ల కాయలు కుళ్ళిపోయి పనికి రాకుండా పోతాయి.

పొలంలో శనగపచ్చ పురుగు ఆశించిందని గమనించిన వెంటనే అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. టమోటో పంట మధ్యమధ్యలో అక్కడక్కడ బంతి మొక్కలను నాటుకోవాలి. దీని వల్ల పురుగు బెడదను కొంత మేర తగ్గించుకోవచ్చు. తొలిదశలో ప్రొపినోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా థయోకార్బ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయెట్ 5 గ్రా. లేదా ట్రేసర్ 4 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 4గ్రా. 10 లీటర్ల నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా శనగపచ్చ పురుగు బారి నుండి టమోటో పంటను కాపాడుకోవచ్చు.