Hotstar: హాట్‌స్టార్ అన్ఇన్‌స్టాల్ చేస్తున్న యూజర్లు.. ట్విట్టర్‌లో ట్రెండింగ్!

మధ్యయుగ భారతకాలం నాటి మొఘల్ సామ్రాజ్యం కథపై డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలైన వెబ్ సిరీస్.. ది ఎంపైర్.

Hotstar: హాట్‌స్టార్ అన్ఇన్‌స్టాల్ చేస్తున్న యూజర్లు.. ట్విట్టర్‌లో ట్రెండింగ్!

Uninstall

Uininstall Hotstar: మధ్యయుగ భారతకాలం నాటి మొఘల్ సామ్రాజ్యం కథపై డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలైన వెబ్ సిరీస్.. ది ఎంపైర్. ఇది మొఘల్ మొదటి చక్రవర్తి బాబర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. నిర్మాతలు ఈ సిరీస్‌ను చరిత్ర-ప్రేరేపిత కల్పనగా ప్రకటించారు. కానీ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుంచి వివాదంలో చిక్కుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్ శుక్రవారం ది ఎంపైర్‌ను విడుదల చేయగా.. అప్పటి నుంచి ట్విట్టర్‌లో వినియోగదారులు సిరీస్‌లో చూపించిన కంటెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #UninstallHotstar అనే పేరతో ట్రెండ్ చేయడం ప్రారంభించారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ నిఖిల్ అద్వానీ నిర్మించిన ఈ సీరియల్‌కు మితాక్షర కుమార్ దర్శకత్వం వహించగా.. ది ఎంపైర్ సిరీస్ అనేది మొఘల్స్ సామ్రాజ్యం ఆధారంగా ఉత్తర చక్రవర్తుల ఆధారంగా అలెక్స్ రూథర్‌ఫోర్డ్ రాసిన ఆరు చారిత్రక నవలల సిరీస్: రైడర్స్ ఫ్రమ్ ది నార్త్. ఇది 1526లో మొదటి పానిపట్ యుద్ధంతో ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్‌లోని వివిధ ప్రదేశాలలో చిత్రీకరించగా.. సిరీస్‌లో భారీ కోటలతో సహా యుద్ధభూమికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి.

ఈ సిరీస్‌లో కునాల్ కపూర్, షబానా అజ్మీ, దృష్టి ధామి, ఆదిత్య సీల్ మరియు డినో మోరియా వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. నిఖిల్ అద్వానీ ఇద్దరు సోదరీమణులు మోనిషా అద్వానీ మరియు మధు భోజ్వాని ఎమ్మా ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ సిరీస్‌ను నిర్మించారు. బాబర్ గురించి ఈ సిరీస్‌లో చేసిన వివరణకు వ్యతిరేకంగా చాలామంది వినియోగదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హాట్‌స్టార్‌లో హిందువుల హంతకులను ప్రశంసిస్తున్నారు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయ నాగరికతను అణిచివేసి నాశనం చేసిన అనాగరిక జాతి అద్భుతమైనదని, గొప్పదని హాట్‌స్టార్ చెబుతుందని, దానిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే #UninstallHotstar అని నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయ్యింది. స్మార్ట్‌ఫోన్ నుండి OTT యాప్‌ను తీసివేసి, దాని స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం, ఈ సిరీస్‌కి సంబంధించి హాట్‌స్టార్ అధికారులకు ఫిర్యాదు అందింది. బాబర్ సిరీస్‌లో కీర్తింపబడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ సిరీస్ బాబర్‌ని కీర్తించడం లేదని తోసిపుచ్చారు అధికారి. ఈ సిరీస్‌లో వివాదాస్పదంగా ఏమీ చెప్పలేదని హాట్‌స్టార్ ప్రకటించింది.

ట్విట్టర్‌లో #UininstallHotstar టాప్ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇదే సమయంలో ప్లే స్టోర్‌లో కూడా తక్కువ రేటింగ్ ఇస్తున్నారు.