Ganesh Festival : సెప్టెంబర్ 10న గణేష్ ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కరోనా వల్ల నియమనిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.

Ganesh Festival : సెప్టెంబర్ 10న గణేష్ ఉత్సవాలు

Ganesh

Ganesh Festival 2021: గణేష్ ఉత్సవాలను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కరోనా వల్ల నియమనిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. 2021, ఆగస్టు 28వ తేదీ శనివారం ఉదయం మంత్రి తలసాని అధ్యక్షతనలో MCHRDలో గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ…సెప్టెంబర్ 10వ తేదీన గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, కరోనా నిబంధనలు పాటిస్తూ..ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.

Read More : Pierce Fruit : శరీరానికి పోషకాలనిచ్చే పియర్స్ పండు

అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఏడా వినాయక పండుగ, నిమజ్జనం ఘనంగా జరుపుకుంటున్నామనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పండుగ విషయంలో శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, అన్ని డిపార్ట్ మెంట్లలతో సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్న పోలీసులతో పాటు…రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసుల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Read More :Bride Bill : పెళ్లికి రాలేదని..! ఫ్రెండ్ కు రూ.17వేల బిల్లు పంపిన వధువు

ఫెస్టివల్ విషయంలో ఇప్పటికే పోలీసులతో మీటింగ్ జరిగిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ రూట్ లో కొన్ని కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణాలు జరిగాయని, ఈ విషయంలో గణపతి ఎత్తును చూసుకోవాలని మంటపాల నిర్వాహకులకు సూచించారు. ప్రతి మండపానికి క్యూ ఆర్ కోడ్, జియో ట్యాగ్ పెడుతామని, ప్రశాంత వాతావరణంలో పండుగ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.