Pierce Fruit : శరీరానికి పోషకాలనిచ్చే పియర్స్ పండు

పియర్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మహిళల్లో ముఖ్యముగా మోనోపాజ్ దశ దాటినవారికి గర్భ కోశ సమస్యలు తగ్గిపోతాయి. గుండె జబ్బులు రాకుండా సాయపడుతుంది.

Pierce Fruit : శరీరానికి పోషకాలనిచ్చే పియర్స్ పండు

Pierce Fruit

Pierce Fruit : కరోనా రాకతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువైంది. మంచిపోషకాలు అందించే పండ్లను తినేందుకు ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లో పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. సీజన్ల వారిగా మార్కెట్లోకి అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిస్దున్నారు. ఆరోగ్యానికి మేలు కలిగించే పండ్లలో యాపిల్ తరహాలోనే చక్కని రుచికలిగిన పండు పియర్స్. ఆరోగ్యానికి పియర్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ పండు ద్వారా చేకూరతాయి.

పియర్స్ లో కాల్షియం, ఐరన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి వాటితో పాటు విటమిన్లు సి, ఈ, కె ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతిరోజు పియర్స్ తినటం వల్ల బరువు తగ్గటంతోపాటు, టైప్ 2డయాబెటిస్ నియంత్రణలో ఉంటున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. పియర్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మహిళల్లో ముఖ్యముగా మోనోపాజ్ దశ దాటినవారికి గర్భ కోశ సమస్యలు తగ్గిపోతాయి. గుండె జబ్బులు రాకుండా సాయపడుతుంది. కంటి చూపు మెరుగుపడడానికి బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఎలర్జీలను దూరం చేసే పోషకాలు ఇందులో ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు తీపి పండ్లు తినకూడదు. అలాంటి వారు పియర్స్ పండును తింటే మంచి ఫలితం ఉంటుంది.

కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఈ పండు తినటం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ ఫైబర్, తక్కువ కేలరీలు శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ల కారణంగా ఎక్కువ వయస్సు ఉన్నవారు తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తారు. శరీరంలోని విష పదార్థాలని బయటకు పంపించడంలో దోహదం చేస్తుంది.

రోజుకు రెండు పియర్స్ తినేవాళ్లకు నడుం చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది. తింటే రుచికరంగా ఉన్నాయని ఈ పండ్లను అంతిగా తినటం వల్ల కొన్ని అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ పండ్లు తింటే గ్యాస్, పొట్ట ఉబ్బరం, విరేచనాలు, వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.