India Covid-19 : కరోనా కల్లోలం.. నిన్న వైరస్ సోకిన వాళ్లలో 50 శాతం మంది తొలి డోసు తీసుకున్నవాళ్లే!

44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.

India Covid-19 : కరోనా కల్లోలం.. నిన్న వైరస్ సోకిన వాళ్లలో 50 శాతం మంది తొలి డోసు తీసుకున్నవాళ్లే!

India Covid 19

India Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న ఒక్కసారిగా పెరిగిన కేసులు ఈరోజు కాస్త తగ్గాయి. అయితే, 44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కరోనా కేసుల్లో మూడు శాతం క్షీణత కనిపించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 3.26 కోట్లకు చేరాయి. కరోనా మరణాల సంఖ్య 4,36,861కి పెరిగింది.

కాగా, ఇప్పటివరకు కనీసం 61 కోట్ల మంది లబ్ధిదారులకు కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను అందించారు. అర్హులైన జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సిన్ మొదటి మోతాదుతో టీకాలు వేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ”భారత్ అపూర్వమైన మైలురాయిని సాధించింది. అర్హత కలిగిన జనాభాలో 50శాతం మంది కరోనా వ్యాక్సిన్ తొలి మోతాదుతో టీకాలు వేశారు. కరోనాపై పోరాటం కొనసాగిద్దాం” అని ఆయన ట్వీట్ చేశారు.

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కంటిన్యూ అవుతోంది. 24 గంటల్లో అక్కడ 30వేల 077 కేసులు నమోదయ్యాయి. దక్షిణాదిన కేరళలో అత్యధిక సంఖ్యలో రోజువారి కేసులు నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 5,108 కొత్త కేసులు, 145 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత మూడవ స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడులో 1559 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ (1539 కరోనా కేసులు) ఉంది. ఐదవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం నిలిచింది. కర్ణాటకలో 1213 కరోనా కేసులు నమోదయ్యాయి.