Covid brain disease : కోలుకున్న కోవిడ్ బాధితుల్లో మూడోవంతు మెదడు వ్యాధితో బాధపడుతున్నారు

కరోనా నుంచి కోలుకున్నవారిలో దీర్ఘకాలిక వైరస్ లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోలుకున్నాక ముగ్గురిలో ఒకరు దీర్ఘకాలిక మానసిక సమస్యలు, నాడిసంబంధిత వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారని రీసెర్చర్లు తమ అధ్యయనంలో వెల్లడించారు.

Covid-19 survivors suffer brain disease : కరోనా నుంచి కోలుకున్నవారిలో దీర్ఘకాలిక వైరస్ లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోలుకున్నాక ముగ్గురిలో ఒకరు దీర్ఘకాలిక మానసిక సమస్యలు, నాడిసంబంధిత వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారని Ryan Prior రీసెర్చర్లు తమ అధ్యయనంలో వెల్లడించారు. కరోనా సోకిన ఆరు నెలల కాలంలో 34శాతం మంది బాధితులు మానసిక సమస్యలు లేదా నరాల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. బాధితుల్లో ఎక్కువగా కనిపించే లక్షణం.. ఆందోళన.. ఇది 17శాతం మందిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత మానసిక సమస్యలతో 14 శాతం మంది బాధితులు బాధపడుతున్నారు.

తీవ్రమైన కరోనాతో ఆస్పత్రిలో చేరి కోలుకున్న బాధితుల్లో నరాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో వ్యాధి లక్షణాల రేటు కూడా పెరిగినట్టు తేలింది. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల్లో ఈ తరహా లక్షణాలు 39శాతం మందిలో కనిపించాయని మాగ్జిమ్ తాకత్ తెలిపారు. అధ్యయన ఫలితాలను పరిశీలిస్తే.. మెదడు సంబంధిత వ్యాధులతో పాటు మానసిక ఆందోళనలు సాధారణంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా సోకినవారిలో జ్వరం లేదా శ్వాసపరమైన సమస్యల తర్వాత ఈ తరహా లక్షణాలు సాధారణమని వైద్యులు చెబుతున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్నాక ఆరు నెలల తర్వాత వారిలో ఏమైనా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయో లేదో చూడాలన్నారు. 2లక్షల 36వేల మందికి పైగా కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తే.. వారిలో ఎక్కువగా కరోనావైరస్ ఒక మెదడు సంబంధిత వ్యాధిగా రూపాంతరం చెందిందని అధ్యయన పరిశోధకులు గుర్తించారు. ఎక్కువగా అమెరికాలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 50 మంది కరోనా బాధితుల్లో ఒకరు ischemic stroke వ్యాధితో బాధపడుతున్నారని పరిశోధకులు తేల్చేశారు. ఈ సమస్య ఉన్న బాధితుల్లో మెదడులోని రక్తం గడ్డకట్టి మానసిక సమస్యలకు దారితీస్తుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు