Aloe Vera : అధిక బరువును తగ్గించే కలబంద

కలబంద రసం లో ఉండే ఫైటో స్టెరాల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. దీని ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో ఉపయోగించబడతాయి. దీంతో శరీర బరువు తగ్గవచ్చు.

Aloe Vera

Aloe Vera : సహజంగా బరువు తగ్గించుకోవాలనుకునే వారికి కలబంద ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాతో పాటూ, కలబంద రసాన్ని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కలబంద జ్యూస్ లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాలచుట్టు ఏర్పడే కొవ్వును కరిగించడంలో అలోవెర తోడ్పడుతుంది. తద్వారా అలోవెర జ్యూస్ అధికబరువును సహజంగా తగ్గిస్తుంది.

కలబంద రసం లో ఉండే ఫైటో స్టెరాల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. దీని ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో ఉపయోగించబడతాయి. దీంతో శరీర బరువు తగ్గవచ్చు. చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉండే కలబంద, శరీర బరువు తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తుంది. వివిధ రూపాల్లో కలబందను తీసుకోవటం ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. కలబందను ఎలా తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కలబంద, అల్లం ; అల్లం మన శరీర బరువు తగ్గించే అద్భుతమైన ఔషదం. ఒక చెంచా కలబంద రసం, ఒక చెంచా అల్లం మరయు ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. వీటిని తక్కువ మంట వద్ద కలిపి వేడి చేయాలి. ఇలా తయారు చేసిన మిశ్రమం బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది.

కలబంద, గ్రీన్ టీ ; యాంటీఆక్సిడెంట్ లను అధికంగా కలిగి ఉండే గ్రీన్ టీ శరీర బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది. దీని తయారీకి గానూ, కలబంద ఆకు, గ్రీన్ టీ అవసరం అవుతాయి. దీనిని రోజులో రెండు సార్లు తీసుకోవటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. మంచి ఫలితాల కోసం ఉదయాన పడిగడుపున, రాత్రి పడుకునే ముందు తీసుకోవటం చాలా మంచిది.

కలబంద,నిమ్మరసం; ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. దానితో ఒక టీస్పూన్ కలబంద గుజ్జును కలపండి. ఈ ద్రావణాన్ని ఒక గిన్నెలో వేడి చేసి తిప్పుతూ ఉండాలి. ఒక టీస్పూన్ తేనెతో తీసుకోవాలి.

కలబంద, తేనె ; కలబంద రసంలో తేనె కలుపుకొని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. తద్వారా దాని రుచి మరింత మెరుగుపడుతుంది.