Cholesterol (1)
Bad Cholesterol : జీవనశైలి ,అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అలాంటి ఆరోగ్యసమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యగా చెప్పవచ్చు. అయితే దీర్ఘకాలంలో దీని ప్రభావం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు కొలెస్టల్ అవసరత ఉంది. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు చుట్టుముడతాయి.
మానవ శరీరానికి విటమిన్ డి, హార్మోన్లు మరియు బైల్ జ్యూస్ ఉత్పత్తిలో కొవ్వు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కొవ్వులను ఎల్ డిఎల్ చెడు కొవ్వులని , హెచ్ డిఎల్ మంచి కొవ్వులని రెండు రకాలుగా సూచిస్తారు. శరీర కొవ్వులో 25% మాత్రమే ఆహార వనరుల నుండి వస్తుంది. మిగిలినది కాలేయం ద్వారా ఉత్పత్తి జరుగుతుంది.
జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. తరచుగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం ,అధిక బరువు రక్తంలో చక్కెర స్ధాయి పెరగటానికి దారి తీస్తుంది. కొవ్వు పదార్ధాలను తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొవ్వుల మొత్తం పెరుగుతుంది. గుడ్లు, హెర్రింగ్, షెల్ఫిష్ మరియు ఇతర ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
అధిక కొవ్వు సమస్యలతో బాధపడేవారు కేలరీలు, ట్రాన్స్ ఫ్యాట్స్, అదనపు లవణాలు, వేయించిన, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం మానేయాలి. కేకులు, ఐస్ క్రీం, పేస్ట్రీలు మరియు స్వీట్లు వంటి స్వీట్ ట్రీట్‌లు తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన మాంసాలను తినరాదు. వీటిని తీసుకుంటే త్వరగా కొవ్వులు పెరిగే అవకాశం ఉంటుంది.