పియర్స్ అంటే ఆకుపచ్చ రంగులో యాపిల్ పండ్లలా కనిపిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎంతో మంచిది అంటున్నారు పోషకనిపుణులు. ముఖ్యంగా పియర్స్ డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. జీర్ణక్రియని పెంచుతుంది. ఇంకా క్యాన్సర్లనీ నిరోధిస్తాయి. పైగా వీటివల్ల ఎలాంటి అలర్జీలూ ఉండవు కాబట్టి పసిపిల్లలకి కూడా పెట్టొచ్చు.ఈ పండ్లలో ఫోలిక్ ఆమ్లశాతం కూడా ఎక్కువే కాబట్టి గర్భిణీలూ వీటిని రోజూ తీసుకుంటే మంచిదట. జ్వరంతో బాధపడేవాళ్లు ఈ పండ్లను తినడంవల్ల జ్వర తీవ్రత వెంటనే తగ్గుతుందట.
పియర్స్‌లో ఎక్కువ భాగం నీళ్లు, పీచు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే… పొట్ట నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. దాంతో వేరే ఆహార పదార్థాలు తినలేరు. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం తప్పుతుంది. ఈ పండ్ల వల్ల రక్తహీనత సమస్య ఉన్నవారు, పుట్టుకతో లోపాలు ఉన్నవారు, ఎముకలు, దంతాలు సమస్యలు కలిగిన వారు పియర్స్ పండ్లను తింటుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా బయట పడవచ్చు. అలాగే పియర్స్ పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
* డయాబెటిస్ కి చెక్..
డయాబెటిస్ ఉన్న వాళ్లు అన్ని రకాల పండ్లు తినకూడదు. కానీ పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ (పీచు పదార్థం)తో అందరూ తినేందుకు వీలవుతుంది. పైగా ఇందులో మన శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లలో ఒకవేళ హై బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌కి తీసుకురాలేకపోతే, అవి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రెగ్యులర్ ట్రీట్‌మెంట్, సరైన ఆహారం, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తుంటే, అధిక బరువు తగ్గడమే కాకుండా… షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలా బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది.