Black Seed Oil : జుట్టు రాలే సమస్యను తొలగించటంతోపాటు నొప్పులను నివారించే నల్ల జీలకర్ర నూనె!
చర్మాన్ని శుభ్రంగా , మెరిసేలా చేయడానికి నల్ల జీలకర్రను ఉపయోగిస్తారు. నల్ల జీలకర్ర నూనెలో , థైమోల్, నిగ్లిసిన్, కార్వాకోల్, ఆల్ఫా-హెడారిన్, టిమోక్వినోన్ వంటి ముఖ్యమైన రసాయనాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాల కారణంగా, నల్ల జీలకర్ర విత్తనాలు యాంటీఆక్సిడెంట్,యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

Black Cumin Oil
Black Seed Oil : నల్ల జిలకరను సహజ నొప్పిసంహారిణి అని పిలుస్తారు.అనేక రకాల పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఎలాంటి దుష్ప్రభావాలను కల్గించకుండా నొప్పిని త్వరగా ఉపశమనం చేస్తుంది. నొప్పి, వాపు మరియు తలనొప్పి నుండి ఉపశమనానికి నల్ల జిలకర బాగా సహాయపడుతుంది.నల్ల జిలకర గింజల నూనెను నుదుటిపై రాసుకుంటే తలనొప్పి మాయమవుతుంది. కీళ్ళనొప్పి వల్ల వచ్చే ఎముకల నొప్పులను నివారించడానికి కూడా నల్ల జిలకర నూనెను కూడా ఉపయోగించవచ్చు.
నల్ల జీలకర్ర నూనెతో జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు. నల్ల జీలకర్ర నూనెను తలకు రాసుకుని తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడి జుట్టును చక్కగా సంరక్షించుకోవచ్చు. జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవాలంటే.. నల్ల జీలకర్ర నూనె మనం ఇంట్లోనే తయారుచేసుకుని వాడుకోవచ్చు. నల్ల జీలకర్ర నూనె మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని బాగా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.
చర్మాన్ని శుభ్రంగా , మెరిసేలా చేయడానికి నల్ల జీలకర్రను ఉపయోగిస్తారు. నల్ల జీలకర్ర నూనెలో , థైమోల్, నిగ్లిసిన్, కార్వాకోల్, ఆల్ఫా-హెడారిన్, టిమోక్వినోన్ వంటి ముఖ్యమైన రసాయనాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాల కారణంగా, నల్ల జీలకర్ర విత్తనాలు యాంటీఆక్సిడెంట్,యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కొబ్బరినూనె, నల్లజీలకర్ర నూనెతో కలిపి తల మాడుకు బాగా మర్దన చేయాలి. ఆపై గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టును సంరక్షించుకోవచ్చు.