Speakers Gifting: వామ్మో.. స్పీకర్స్‌లో 2కిలోల పేలుడు పదార్ధాలు నింపి పెళ్లి గిఫ్ట్‌గా ఇచ్చాడు.. పెళ్లి కొడుకు మర్డర్‌కు ఖతర్నాక్ ప్లాన్..
ఏదో తప్పు జరిగిందని అనుమానించిన ఖాన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాడు. (Speakers Gifting)

Speakers Gifting: ఛత్తీస్ గఢ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి చేసిన కుట్ర అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఆమె భర్తను చంపేందుకు అతడు కుట్ర చేశాడు.
స్పీకర్స్ లో 2 కిలోల పేలుడు పదార్ధాలు నింపి పెళ్లి కానుకగా ఇచ్చాడు. అది ఆన్ చేయగానే పేలిపోయేలా దాన్ని సెట్ చేశాడు.
అయితే, అతడి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. కుట్రకోణం బయటపడింది. ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు.
హత్యకు ఖతర్నాక్ స్కెచ్..
2 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ప్లగ్ ఇన్ చేసినప్పుడు పేలిపోయేలా ఉండే స్పీకర్‌లను బహుమతిగా ఇచ్చి ఒక వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు 20 ఏళ్ల వ్యక్తితో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఆ వ్యక్తిని చంపేందుకు నిందితుడు కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
ఈ సంఘటన ఆగస్టు 15న ఖైరాగఢ్-చుయిఖాదన్-గండాయ్ జిల్లాలోని మన్పూర్ గ్రామంలో జరిగింది. అఫ్సర్ ఖాన్ ఒక ఎలక్ట్రీషియన్. చిన్న దుకాణం నడుపుతున్నాడు.
కొన్ని రోజుల క్రితం ఖాన్ పేరుతో నకిలీ ఇండియా పోస్ట్ లోగోతో ఒక బహుమతిని అందుకున్నాడు.
అయితే దానిపై పంపిన వారి పేరు కానీ, బహుమతికి కారణం వంటి ఇతర సమాచారం ఏదీ దానిలో లేదు.
గిఫ్ట్ డెలివరీ అయ్యే సమయానికి ఖాన్ దుకాణం మూసివేసి ఉంది. ఆగస్టు 15న ఖాన్ తన దుకాణానికి వచ్చాడు. అక్కడ బహుమతిని చూశాడు. దాన్ని తెరిచాడు.
అందులో స్పీకర్లు ఉన్నాయి. అయితే, అవి సాధారణ వ్యవస్థ కంటే చాలా బరువుగా ఉన్నాయి. దీంతో అతడికి అనుమానం కలిగింది.
ఏదో తప్పు జరిగిందని అనుమానించిన ఖాన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు స్పాట్ కి వచ్చారు. ప్రాథమిక దర్యాప్తు జరిపారు.
అనంతరం బాంబు గుర్తింపు నిర్వీర్య బృందం (BDDS) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ స్క్వాడ్‌లోని ఒక కుక్క స్పీకర్లలో దాచిన పేలుడు పదార్థాలను గుర్తించింది. దీంతో అంతా షాక్ కి గురయ్యారు.
“మొదట, ఇది ఎటువంటి ఆధారాలు లేని బ్లైండ్ కేసు. కానీ మేము సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల కోసం వెతకడం ప్రారంభించాము. ఇది ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మాకు దారితీసింది” అని పోలీసు అధికారి తెలిపారు.
ప్రధాన నిందితుడు వినయ్ వర్మ ఐటీఐ డిప్లొమా హోల్డర్. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను బోర్ బావులను కూడా ఏర్పాటు చేస్తాడు. దీని కారణంగా అతనికి పేలుళ్లు నిర్వహించడంలో అనుభవం ఉంది.
వర్మ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. బాంబులను ఎలా తయారు చేయాలి, పోలీసులకు చిక్కకుండా ఎలా ఉండాలి అనేది ఆన్‌లైన్ శోధించి వర్మ తెలుసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వర్మ ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ సాయంతో మ్యూజిక్ సిస్టమ్ లోపల బాంబును అమర్చాడు. పేలుడుకు కారణమయ్యేలా బాంబులో జెలటిన్ స్టిక్స్ ఉన్నాయి.
మ్యూజిక్ సిస్టమ్‌ను ఎలక్ట్రిక్ సాకెట్‌లోకి ప్లగ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా పేలుడు సంభవించే విధంగా రూపొందించబడింది.
తాను పట్టుబడలేనని నమ్మకంగా ఉన్నానని అయితే, పోలీసులు తనను పట్టుకున్నాక తాను షాక్ కి గురయ్యానని వర్మ చెప్పాడు. ఎందుకిలా చేశావు అని పోలీసులు ప్రశ్నించగా నిందితుడు వర్మ అసలు విషయం చెప్పాడు.
తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ఖాన్ పెళ్లి చేసుకున్నాడని, అందుకే అతడిని చంపేయాలని ప్లాన్ చేశానని వర్మ ఒప్పుకున్నాడు.
ప్రేమ పేరుతో వేధింపులు..
పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వర్మ తనను వేధించేవాడని తన భార్య తన చెప్పిందని ఖాన్ తెలిపాడు. అంతేకాదు ఏదైనా హాని కలిగించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని తన భార్య తనను హెచ్చరించిందని ఖాన్ పోలీసులకు చెప్పాడు.
తన భార్య ముందే హెచ్చరించటం వల్లే ఆ బహుమతిపై తనకు అనుమానం వచ్చిందని ఖాన్ వివరించాడు.
దుర్గ్ జిల్లాలోని ఒక స్టోన్ క్వారీ నుండి వేల రూపాయలకు కొనుగోలు చేసిన IEDని సేకరించడానికి తనకు సాయం చేసిన సహచరుల గురించి, బహుమతిని అందించడానికి దానిపై నకిలీ పోస్టల్ స్టాంప్‌ను రూపొందించడానికి తనకు సాయం చేసిన వారి గురించి వర్మ పోలీసులకు విచారణ సమయంలో చెప్పాడు.
వర్మకు సాయం చేసిన వారి అరెస్ట్..
వర్మకు సాయం అందించిన పరమేశ్వర్ వర్మ (25), గోపాల్ వర్మ (22), ఘాసిరామ్ వర్మ (46), దిలీప్ ధీమార్ (38), గోపాల్ ఖేల్వార్, ఖిలేష్ వర్మ (19) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి సాయం చేసిన ముగ్గురు నిందితులకు వర్మ ఏం చేయాలనుకుంటున్నాడో తెలియకపోవచ్చునని పోలీసులు చెప్పారు.
ఈ నేరానికి సంబంధించిన పేలుడు పదార్థాలు, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను ఎలా తరలించారనే దానిపై రాతి క్వారీ యజమానిని కూడా ప్రశ్నిస్తామన్నారు.
పేలిపోయిన హోమ్ థియేటర్ స్పీకర్లు..
ఏప్రిల్ 2023లో కబీర్‌ధామ్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.
పెళ్లి బహుమతిగా అందుకున్న హోమ్ థియేటర్ స్పీకర్లు పేలి 25 ఏళ్ల నవ దంపతులు, అతని 30 ఏళ్ల సోదరుడు మరణించారు.
ప్రియురాలి భర్త హత్యకు ప్లాన్..
ఆ కేసులో, ఆటో మెకానిక్‌గా పనిచేసే 33 ఏళ్ల సర్జు మార్కం అరెస్ట్ అయ్యాడు.
వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ, ఒక మహిళ తనను తిరస్కరించడంతో మార్కం కలత చెందాడు.
కొత్తగా పెళ్లైన ఆమె భర్తను హత్య చేయాలని అతను ప్లాన్ చేశాడని ఆరోపించారు.
Also Read: 1,000 అడుగుల ‘మెగా సునామీ’.. తలుచుకుంటేనే గజగజా వణికిపోతాం.. అటువంటిది ఇప్పుడు..