Director Teja Movie: దర్శకుడు తేజ కుమారుడు హీరోగా ఆరంగేట్రం.. హీరోయిన్‌గా ఈ స్టార్ కిడ్‌? ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి..

తేజ గతంలో ‘చిత్రం’, ‘నువ్వు నేను’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించి సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Director Teja Movie: దర్శకుడు తేజ కుమారుడు హీరోగా ఆరంగేట్రం.. హీరోయిన్‌గా ఈ స్టార్ కిడ్‌? ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి..

Director Teja

Updated On : August 17, 2025 / 7:33 PM IST

Director Teja Movie: టాలీవుడ్ దర్శకుడు తేజ త్వరలో తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తేజ తన కుమారుడు అమితవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘విక్రమాదిత్య’ అనే పీరియాడికల్ లవ్‌స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. 18వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక భావోద్వేగ ప్రేమకథగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Mega tsunami: 1,000 అడుగుల ‘మెగా సునామీ’.. తలుచుకుంటేనే గజగజా వణికిపోతాం.. అటువంటిది ఇప్పుడు..

ఈ చిత్రంలో హీరోయిన్‌గా సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, రమేశ్ బాబు కుమార్తె భారతి నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. (Director Teja Movie)

తేజ గతంలో ‘చిత్రం’, ‘నువ్వు నేను’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించి సత్తా చాటిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ద్వారా తన కుమారుడిని హీరోగా ఆవిష్కరిస్తూ, మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ‘విక్రమాదిత్య’ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం తేజ రానా దగ్గుబాటితో తన రెండో చిత్రాన్ని ‘రాక్షస రాజా’ పేరుతో ప్రకటించారు. తేజ, రానా ఇంతకుముందు చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ విజయం సాధించింది.

‘రాక్షస రాజా’పై ఎటువంటి అప్‌డేట్ రాలేదు. ఇప్పుడు తేజ తన కుమారుడు అమితోవ్ తేజతో సినిమా చేయడాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం అమితోవ్ విదేశాల్లో ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్సులు పూర్తి చేశాడు.