Fertility Collapse: మగతనాన్ని చంపేస్తున్న రసాయనాలు.. సంతాన వైఫల్యానికి దారితీయొచ్చు : సైంటిస్టుల హెచ్చరిక

రసాయన కాలుష్య కారకాలతో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అది లైంగిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పురుషుల పురుషాంగం అంతకంతకు కుదించకపోతుదంట..

Fertility Collapse: మగతనాన్ని చంపేస్తున్న రసాయనాలు.. సంతాన వైఫల్యానికి దారితీయొచ్చు : సైంటిస్టుల హెచ్చరిక

Chemical Pollutants Are Shrinking Penises And Leading To A Fertility Collapse, Scientist Warns

Chemical Pollutants Are Shrinking Penises : పర్యావరణానికి మేలు చేస్తే.. అది తిరిగి మేలు చేస్తుంటారు. కానీ, దానిపట్ల దురుసుగా ప్రవర్తిస్తే.. మాత్రం పర్యావసనాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయనడంలో సందేహమే అక్కర్లేదు. రసాయన కాలుష్య కారకాలతో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అది లైంగిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పురుషుల పురుషాంగం అంతకంతకు మడుచుకునిపోతుందంట..

ఫలితంగా సంతానోత్పత్తి క్షీణించి పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోతున్నారని ఓ కొత్త అధ్యయనం ఆధారంగా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రముఖ పర్యావరణ పునరుత్పత్తి ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ షన్నా హెచ్. స్వాన్ ఈ కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు. 21వ శతాబ్దపు జీవన శైలితో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనేక అంశాలను ప్రస్తావించారు. ఆధునిక వాతావరణంలో రసాయనాలు మానవ లైంగికత సంతానోత్పత్తిని ఎలా మారుస్తున్నాయనే దానిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Chemical Pollutions కొన్ని పాశ్చాత్య దేశాలలో పురుషులలో స్పెర్మ్ స్థాయిలు కేవలం నాలుగు దశాబ్దాలలో 50 శాతానికి పైగా తగ్గినట్టు గుర్తించారు. రసాయనాలు లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధానంపై అధ్యయనం చేస్తున్నట్టు సైంటిస్టులు పేర్కొన్నారు. బొమ్మల నుంచి ఫుడ్ ప్యాకేజింగ్, హెయిర్ స్ప్రేలు, పెయింట్స్ వరకు వందలాది వినియోగదారు ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాలతో పురుషాంగం సైజు తగ్గిపోవడానికి కారణమవుతోందని తేలింది. ఈ రసాయన కాలుష్య కారకాలతో హార్మోన్ల వ్యవస్థలకు ఆటంకం కలిగించడమే కాకుండా వీర్యకణాల సంఖ్య క్షీణించిపోవడానికి కారణమవుతుందని పేర్కొంది.

Chemical ఈ ముప్పు అందరిలోనూ ఉండకపోవచ్చు. కానీ, శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం వంటి లైంగిక చర్యలో మార్పులతో ముడిపడి ఉన్నాయని ఆధారాలు సూచిస్తున్నాయి. మానవాళి భవిష్యత్తుకు కూడా ముప్పు కలిగిస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే రసాయనాల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని, వాడకాన్ని వెంటనే తగ్గించుకోవడం ఎంతో ఉత్తమమని అంటున్నారు.